అదే ట్రెండ్ ఫాలో అవుతున్న నాని
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో ప్రతీ సినిమాకు ఆడియో వేడుకను భారీగా నిర్వహించేవారు. ఆడియో రిలీజ్ నుంచే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొంత మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలకు ఆడియో వేడుకలు నిర్వహించకుండా పాటలను డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా మంది ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో సరైనోడు, ధృవ సినిమాలతో పాటు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 సినిమాకు కూడా ఆడియో వేడుక నిర్వహించలేదు. అదే బాటలో నడిచేందుకు నిర్ణయించుకున్నాడు యంగ్ హీరో నాని. దిల్ రాజు నిర్మాతగా.., త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో.., నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా నేను లోకల్. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించకుండా పాటలను డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ముందుగా సినిమాలోని 'నెక్ట్స్ ఏంటి' అనే పాటను జనవరి 6న సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్ననేను లోకల్ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This 6th @ 6PM First song from #NenuLocal will be out online :)#NextEnti
— Nani (@NameisNani) 4 January 2017
Happy New Year :)) pic.twitter.com/YDPWLxw6pE