
నానీకి పోటి వస్తున్నకామెడీ స్టార్లు
వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న నాని, ఈ సినిమాతో అదే జోరును కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అయితే ఇద్దరు కామెడీ స్టార్లు మాత్రం నాని స్పీడుకు బ్రేకులు వేసేందుకు రెడీ అవుతున్నారు.
తొలి సారిగా హీరోలుగా మారుతున్న ఇద్దరు కామెడీ స్టార్లు డిసెంబర్ 23నే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ స్టార్ కమెడియన్గా యమా బిజీగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్లో తెరకెక్కిన మీలో ఎవరు కోటీశ్వరుడుతో పాటు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాలు డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్నాయి. నాని సినిమా కూడా కామెడీ ఎంటర్టైనరే కావటంతో ఈ రెండు సినిమాల ప్రభావం నాని సినిమా మీద పడే అవకాశం ఉంది. ఈ కామెడీ స్టార్ లు నాని స్పీడుకు బ్రేకులేస్తారేమో చూడాలి.