
విశాఖపట్నం :‘మజ్ను పేరు మా కుటుంబానికి బాగా కలిసివచ్చింది. ఆ పేరుతో వచ్చిన నాన్న సినిమా హిట్టయింది . ఇప్పుడు నా సినిమా మిస్టర్ మజ్ను ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది ’ అన్నారు సినీ హీరో అఖిల్. మిస్టర్ మజ్ను విజయోత్సవంలో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చిన చిత్రయూనిట్ ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించింది. హీరో అఖిల్ మాట్లాడుతూ వైజాగ్‌లో బీచ్ ఉండటం విశాఖ ప్రజల అదృష్టమన్నారు. హైదరాబాద్‌లో బీచ్ లేకపోవటంతో తనకు కాస్త చాలా జెలసీగా కూడా ఉందన్నారు. వైజాగ్ ప్రజలు, బీచ్, వాతావరణం చాలా బాగుంటాయని, అందుకే తనకు విశాఖ అంటే చాలా ఇష్టమని అన్నారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ నిధి, దర్శకుడు వెంకీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment