
ప్రేమ కబుర్లకి ఫుల్‌స్టాప్ పెట్టి ఫైట్స్ చేయడానికి, పాటలు పాడటానికి రెడీ అవుతున్నారు అఖిల్. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్, నిధిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా టాకీ పార్ట్ బుధవారంతో పూర్తవుతుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఆరు పాటలు ఉండగా మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. మరో మూడు పాటలు, రెండు ఫైట్లు మినహా సినిమా మొత్తం పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment