మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాని | Nani Majnu Release in Malayalam | Sakshi
Sakshi News home page

మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాని

Published Sat, Feb 4 2017 3:52 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాని

మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాని

మన హీరోలు తమ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేస్తుండగా.. కొంత మంది హీరోలు మరో అడుగు ముందుకేసి బహుభాషా చిత్రాలు చేస్తున్నారు. అదే బాటలో నాచురల్ స్టార్ నాని కూడా మాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ శుక్రవారం నేను లోకల్ అంటూ టాలీవుడ్లో సత్తా చాటిన యంగ్ హీరో నాన్ లోకల్ ఏరియాలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాలీవుడ్ నిర్మాత జీపీ సుధాకర్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే నాని కెరీర్లో ఇంతకన్నా పెద్ద హిట్స్ ఉన్నా ఈ సినిమానే రీమేక్ చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అను ఇమ్మాన్యూల్ మలయాళంలో స్టార్ హీరోయిన్, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసిన గోపిసుందర్ది కూడా మలయాళ ఇండస్ట్రీనే. అందుకే మాలీవుడ్కు ప్రేక్షకులకు ఈజీగా దగ్గరవుతుందన్న ఉద్దేశంతో మజ్ను సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి నేను లోకల్ అంటూ సక్సెస్ కొట్టిన లోకల్ బాయ్, నాన్లోకల్గా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement