
లైలా ఖాతాలో మరో రెండు సినిమాలు
నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటి, అను ఇమ్మన్యూల్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటి మరో రెండు సినిమాలతో ఆడియన్స్ ముందకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్తో ఆకట్టుకున్న ఈ బ్యూటి సినిమాల ఎంపిక విషయంలో సెలెక్టివ్గా ఉంటోంది.
మజ్ను సినిమాతో పాటు గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమాను పూర్తి చేసిన అను.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా వంశీ కృష్ణ దర్శకత్వంలో ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్గా నటిస్తోంది.., అను ఇమ్మన్యూల్. వీటితో మరిన్ని సినిమాలు డిస్కషన్స్ దశలో ఉండటంతో త్వరలోనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది ఈ లైలా.