మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా | Majnu Audio release Postponed | Sakshi
Sakshi News home page

మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా

Aug 26 2016 1:59 PM | Updated on Sep 4 2017 11:01 AM

మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా

మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా

నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ మజ్ను. వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న నాని, ఈ సినిమా సక్సెస్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా మీద...

నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ మజ్ను. వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న నాని, ఈ సినిమా సక్సెస్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆడియో టీజర్లా విడుదల చేసిన కళ్ళు మూసి అనే పాట అభిమానులను ఆకట్టుకుంది.

అయితే ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా పడింది. కారణాలను వెల్లడించకపోయినా.. ఆడియో వేడుక వాయిదా పడినట్టుగా ప్రకటించాడు హీరో నాని. అభిమానులు నిరాశపడకుండా మరో ఆడియో టీజర్ను రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపాడు. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మిస్తున్నాడు. నాని సరసన అను ఇమ్మాన్యుల్ హీరోయిన్గా నటిస్తున్న మజ్ను సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement