
ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీ పరిచయం అయిన యువ దర్శకుడు విరించి వర్మ. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ, తరువాత మంచి ఫాంలో ఉన్న నాని హీరో మజ్ను సినిమాను తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మజ్ను విడుదలై చాలా కాలం అవుతున్నా ఈ యువ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.
తాజా సమచారం ప్రకారం విరించి వర్మ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మార్చిలో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ హీరోగా నటించనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రటకన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment