![The Buckingham Murders teaser: Kareena Kapoor Khan takes charge in Hansal Mehta mystery thriller](/styles/webp/s3/article_images/2024/08/21/Kareena.jpg.webp?itok=MA5Qfg7S)
డిటెక్టివ్‌గా ఓ మర్డర్ కేసును పరిష్కరించే పనిలో పడ్డారు హీరోయిన్ కరీనా కపూర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది బకింగ్‌హమ్ మర్డర్స్’. హన్సల్ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
విదేశాల్లో నివసిస్తున్న ఓ భారతీయుడి కుటుంబంలోని ఓ చిన్నారి హత్య నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో బ్రిటిష్– ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భామ్రా పాత్రలో కరీనా నటిస్తున్నారని తెలుస్తోంది. ‘‘ఆ రోజు పార్కులో ఏం జరిగింది?, నువ్వు అతన్ని ఎలా చంపావ్?’...., ‘నువ్వు డిటెక్టివ్ కదా.. తెలుసుకో...!’ అనే డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి. ఏక్తా కపూర్, శోభా కపూర్‌లతో కలిసి ఈ సినిమాను కరీనా కపూర్ నిర్మించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment