దెయ్యం ప్రేమలో...! | Sahasam Cheyara Dimbaka thriller movie | Sakshi
Sakshi News home page

దెయ్యం ప్రేమలో...!

Published Sun, Jun 7 2015 10:03 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

దెయ్యం ప్రేమలో...!

దెయ్యం ప్రేమలో...!

ఆ యువకుడు మహా పిరికివాడు. తన నీడను చూసి తానే భయపడే రకం! మరి ఈ యువకుణ్ణి ఏకంగా ఓ దెయ్యం ప్రేమిస్తే! పెళ్లి చేసుకోమని వేధిస్తే.. ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. శ్రీ, హమీద, సమత ముఖ్యతారలుగా ఎంఎస్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుమల శెట్టి కిరణ్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆవిష్కరించారు. ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’,  తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అని ఆయన ఆకాంక్షించారు. ‘‘భయంలో నవ్వులు కలుపుతూ ఈ సినిమా తీశారని ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతోంది’’ అని దర్శకుడు ఎస్‌వి కృష్ణారెడ్డి అన్నారు. దర్శకుడు వి.సముద్ర, సంగీత దర్శకుడు శ్రీ వసంత్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement