గతేడాది రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్‌.. సైలెంట్‌గా ఓటీటీలోకి.. | Rohit Nanda, Anandhi Starrer Vidhi Movie Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

Vidhi OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

Published Sat, Jan 27 2024 12:07 PM | Last Updated on Sat, Jan 27 2024 1:12 PM

Rohit Nanda, Anandhi Starrer Vidhi Movie Streaming On This OTT Platform - Sakshi

ఓటీటీలు వచ్చాక సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చే సినిమాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఎప్పటికప్పుడు థ్రిల్లర్‌ సినిమాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాగే థియేటర్లలో విడుదలైన చిత్రాలను సైతం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే విధి.

ఓటీటీలోకి వచ్చేసిన మూవీ
రోహిత్‌ నందా, ఆనంది జంటగా నటించిన చిత్రం విధి. శ్రీకాంత్‌ రంగనాథన్, శ్రీనాథ్‌ రంగనాథన్‌ రచన, దర్శకత్వంలో ఎస్‌. రంజిత్‌ నిర్మించారు. ఈ మూవీని ఆడియో డిస్క్రిప్టివ్‌ టెక్నాలజీతో తెరకెక్కించారు. దీనివల్ల కంటి చూపు లేనివాళ్లు కూడా ఈ సినిమాను అనుభూతి చెందగలడం విశేషం. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమా గతేడాది నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 26న సైలెంట్‌గా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

కథేంటంటే..
సూర్య (రోహిత్‌ నందా) ఓ అమాయకపు కుర్రాడు. ఉద్యోగం కోసం ఊరి నుంచి పట్నం వస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే క్రమంలో ఓ రోజు ఓ వ్యక్తి దగ్గరున్న కలం చూసి ముచ్చటపడతాడు. కానీ దాని ధర రూ.40 వేలు అని చెప్పడంతో షాకవుతాడు. తర్వాత అలాంటి పెన్‌ ఒకటి హీరోకు దొరుకుంది. ఆ పెన్‌తో ఎవరు రాస్తే వాళ్లు చనిపోతుంటారు. మరి ఈ కలం వల్ల సూర్య జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఆ పెన్‌ వెనక అసలు కథేంటి? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!

చదవండి: చిరంజీవికి అవార్డు.. మంచు మోహన్‌ బాబు ఏం అన్నారంటే
వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement