ప్రయోగాత్మక చిత్రంలో నందమూరి హీరో | Kalyanrams Next Is A Suspense Thriller | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 7 2018 12:34 PM | Last Updated on Wed, Feb 7 2018 12:34 PM

kalyanram - Sakshi

హీరో కళ్యాణ్ రామ్‌

ప్రస్తుతం పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఎమ్మెల్యే సినిమాతో పాటు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న నా నువ్వే సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్‌. ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలను సమ్మర్‌ సీజన్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ రామ్‌ ఓ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్‌, రొమాంటిక్‌ స్టోరీలు మాత్రమే చేసిన కళ్యాణ్ రామ్‌ త్వరలో థ్రిల్లర్ సినిమా చేసేందుకు అంగీకరించాడు.

విజయ్‌ మద్దలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్ కథతో సినిమా చేసేందుకు కళ్యాణ్‌ రామ్‌ అంగీకరించాడట. దర్శకుడు కథ చెప్పిన విదానంతో పాటు కథలోని మలుపుకు కూడా నచ్చటంతో వెంటనే ఈ నందమూరి హీరో ఒకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాడు కళ్యాన్‌ రామ్‌. జై లవకుశ సినిమాతో నిర్మాతగా ఘనవిజయం సాధించిన ఈ నందమూరి హీరో కథ ఎంపికలో కొత్తదనం చూపిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement