kalyanram
-
నార్నే నితిన్, శివానిల నిశ్చితార్థం (ఫొటోలు)
-
ఈ సినిమా నా బిడ్డలాంటిది..ఆ విషయంలో మాత్రమే బాధపడ్డా: డెవిల్ డైరెక్టర్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ డెవిల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించగా.. శ్రీకాంత్ విస్సా కథను అందించారు. అయితే ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ నవీన్ తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దర్శక-నిర్మాతగా అభిషేక్ నామా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ వివాదంపై నవీన్ మేడారం స్పందించారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు క్రెడిట్ దక్కలేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. నవీన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'డెవిల్ చిత్రం కోసం దాదాపు మూడేళ్లు శ్రమించా. స్క్రిప్ట్‌తో సహా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనకు అనుగుణంగా తెరకెక్కించా. ఈ సినిమాను హైదరాబాద్, వైజాగ్, కారైకుడిలో షూట్ చేశాం. చిన్న చిన్న సన్నివేశాలతో సహా దాదాపు 105 రోజులు కష్టపడ్డాం. నేను అనుకున్న విధంగా ఈ చిత్రం తెరకెక్కించా. నాకు కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా డెవిల్ నా సినిమానే.' అని రాసుకొచ్చారు. ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగా ఉన్నా. కానీ నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది. ఈ వివాదంలో చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దర్శకుడిగా నాకు క్రెడిట్ ఇవ్వలేదనే బాధపడుతున్నా. నా టాలెంట్‌పై నాకు నమ్మకం ఉంది. నా కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా.' అని పోస్ట్ చేశారు. కల్యాణ్‌రామ్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని.. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. డిసెంబర్ 29న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా. మరో కొత్త చిత్రానికి సంతకం చేశా. ఆసక్తికరమైన స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నా. త్వరలోనే వెల్లడిస్తానని నవీన్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Naveen Medaram (@naveen_medaram) -
ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ గురించి కళ్యాణ్ రామ్..!
-
ఐడీఎఫ్సీ రీజినల్ ఆఫీస్‌ను ప్రారంభించిన నందమూరి కల్యాణ్ రామ్ (ఫొటోలు)
-
ఆ రెండు సినిమాలతో క్రేజ్.. కేరళ భామకు వరుస ఆఫర్లు..!
భీమ్లా నాయక్, బింబిసార చిత్రాలతో క్రేజ్ సంపాందించుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. ఈ భామ కోసం టాలీవుడ్లో వరుస ఆపర్లు క్యూ కడుతున్నాయి. ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళం, కన్నడలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో సక్సెస్ అందుకుంది. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌లో రానాకు జోడిగా నటించింది ఈ అమ్మడు. (చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ) ‘బింబిసార’ నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఈ భామకు హిట్ టాక్ సెంటిమెంట్ కలిసి రావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. తెలుగులో మొదట కల్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ రాగా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో ‘భీమ్లా నాయక్’తో ఎంట్రీ ఇచ్చింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో అంజనా పాత్రకు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘కలరి’ మూవీతో అభిమానులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘లిల్లీ’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. -
ఆ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్.. స్పందించిన జీ5..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగష్టులో విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని అప్డేట్ల కోసం వెతుకున్నారు. అయితే ‘కార్తికేయ2’ను సైతం దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబరు మొదటివారం స్ట్రీమింగ్కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిన్న చిత్రంగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసింది. (చదవండి: మల్టీప్లెక్స్‌ల్లో 75 రూపాయలకే సినిమా హ్యపీగా చూసేయండి..) ఇక ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం సాధించిన మరో చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం కల్యాణ్‌రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కోసం ఓటీటీలో ఎప్పుడోస్తుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదలపై జీ5 స్పందించింది. ‘మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించండి’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ప్రచారం చూస్తే కల్యాణ్‌రామ్ ‘బింబిసార’ సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మళ్లీ పుట్టినట్లు అనిపించింది.. ఆ మాటలు వింటే భయమేసేది
‘‘బింబిసార’ రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్ఠ్‌కు ధన్యవాదాలు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కొంతమంది మాటలు వింటే భయమేసేది. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాను.. ‘బింబిసార’ విషయంలో అదే నిజమైంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘మేజర్, విక్రమ్’ సినిమాలు మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘బింబిసార, సీతారామం’ ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను’’ అన్నారు. ‘‘మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వశిష్ఠ్. డిస్ట్రిబ్యూటర్లు శివరాం, ఎల్.వి.ఆర్, హరి, ఎ.ఎం.ఆర్ పాల్గొన్నారు. -
NTR Satha Jayanthi: నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్
ఎన్టీఆర్ శత జయంతి: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘‘స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్టీఆర్. వెన్నుపోట్ల ద్వారా రాజ్యాన్ని తీసుకురావాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి -
ఆ ముద్ర వేయడం సంతోషం
‘‘భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని రాసే కథలకు ఫలానా హీరోనే చేయాలి అనేది ఉండదు. కథే హీరో. అలాంటి కథని సినిమాగా చేసేటప్పుడు హీరోనే కథను మోసుకుంటూ వెళ్తాడు. మా సినిమా హీరో కల్యాణ్‌రామ్ ‘ఎంత మంచివాడవురా’ కథకు కావాల్సినంత న్యాయం చేశాడు’’ అని డైరెక్టర్ వేగేశ్న సతీష్ అన్నారు. కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వేగేశ్న సతీష్ చెప్పిన విశేషాలు... ►ఒకే జోనర్లో సినిమాలు చేసే హీరో ఒక్కసారిగా జోనర్ మారితే ఆ హీరో ఎలా చేశాడు? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఉంటుంది. కల్యాణ్‌రామ్ ఎలా చేసుంటాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఉంటుంది. అదే మా సినిమాకు ప్లస్ పాయింట్. మా కథకు అభినయం పరంగా పరిణితి కనబరచే నటుడు కావాలనుకొని ఆయనకు కథ చెప్పాను.. నచ్చటంతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. కథానుగుణంగా ఈ సినిమాలో ఫైట్లు ఉంటాయి.. అవి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ►కెరీర్లో నేను చేసిన రెండు సినిమాలతోనే ఫ్యామిలీ దర్శకుడు అనే ముద్ర వేశారు. ఆ బ్రాండ్ నాకు సంతోషాన్నే ఇస్తోంది. ►స్వతహాగా కథా రచయితనైనా ఏ రోజూ రీమేక్ కథలు చేయాలనుకోలేదు. ‘ఆక్సిజన్’ అనే గుజరాతి సినిమా చూసిన మా నిర్మాతలు ఈ సినిమా రీమేక్ చేస్తే బావుంటుందని శివలెంక కృష్ణప్రసాద్‌గారికి చెప్పారు. ‘సతీష్ వద్దే చాలా కథలు ఉన్నాయి.. రీమేక్ కథ చేస్తాడో? లేదో? డౌటే.. అయినా ఓ సారి అడిగిచూడండి’ అని శివలెంకగారు నిర్మాతలతో అనటంతో నిర్మాతలు నన్ను అడిగారు. సినిమా చూసినప్పుడు ఆ కథలోని హీరో క్యారెక్టర్ నన్ను ఆకర్షించింది. కానీ మిగతా సినిమా మన తెలుగు నేటివిటీకి సరిపోదని చెప్పాను. ఆ తర్వాత నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఈ కథలో మార్పులు చేశాం. సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి. -
గోదావరిలో రిస్క్
కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరి 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి. పాటలను డిసెంబర్లో విడుదల చేస్తాం. ఈ సినిమాకి గోపిసుందర్ సంగీతదర్శకుడు. సీతారామ శాస్త్రి, శ్రీమణి చెరో పాట రాయగా రామజోగయ్య శాస్త్రి రెండు పాటలను రాశారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ను చాలా రిచ్‌గా తీశాం. ఈ ఫైట్‌ను గోదావరి నదిలో ఎంతో రిస్క్‌తో ఫైట్ మాస్టర్ వెంకట్ తెరకెక్కించారు’’ అన్నారు. -
హీరోకి వచ్చిన కలలన్నీ నాకొచ్చినవే
‘‘దర్శకుడిగా నా ప్రయాణం ఓ కలతో మొదలైంది. ఆ కలతో తీసిన ‘118’ సినిమా విజయం సాధించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్. కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా గుహన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ మహేశ్ కోనేరు నిర్మించిన ‘118’ ఇటీవల విడుదలైంది. మంచి టాక్‌తో విజయవంతంగా సాగుతోందన్నారు గుహన్. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘118’లో హీరోకి వచ్చిన కలలు నాకొచ్చినవే. నాకు ఒక పెద్ద రూమ్‌లో ఒక్కడినే ఉండాలంటే చాలా భయం. కానీ కెమెరామేన్‌గా అనేక ప్రదేశాలు తిరుగుతుంటాను కాబట్టి తప్పదు. ఓ సినిమా కోసం నేను ఓ హోటల్ రూమ్‌లో బస చేశాను. రాత్రి నిద్రపోయిన తర్వాత భయంకరమైన కల వచ్చింది. అది నిజంగా జరిగినట్లే అనిపించింది. మర్నాడు ఒంట్లో ఓపిక లేనట్లు నీరసంగా లొకేషన్‌కి వెళ్లాను. డాన్స్‌మాస్టర్ ప్రేమ్‌రక్షిత్ ‘ఏంటి సార్ నీరసంగా ఉన్నారు’ అనడిగితే, ‘కల వచ్చింది’ అని చెప్పాను. కొన్ని కలలు అలానే ఉంటాయి అనుకున్నాం. ఆ కల గురించి ఆ తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాను. ఓ రెండేళ్ల తర్వాత అదే హోటల్లో అదే రూమ్‌లో ఉండాల్సి వచ్చింది. మళ్లీ అదే కలకు కంటిన్యూషన్గా కల రావడంతో ఆశ్చర్యపోయాను. ఓసారి అనుకోకుండా కల్యాణ్‌రామ్‌ను కలిసినపుడు ‘ఓ లైన్ ఉంది వింటారా’ అని అడిగితే ‘సరే’ అన్నారు. రెండు గంటలపాటు కథను నెరేట్ చేశాను. ‘మీరు కెమెరామేన్ అయ్యుండి కథని ఇంత బాగా నెరేట్ చేశారు, మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారాయన. వారం రోజుల్లో సినిమా స్టార్ట్ అయ్యింది. అంతా ఓ కలలా జరిగిపోయింది. ప్రస్తుతం మేం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలామంది నిర్మాతలు వేరే భాషలో ఈ సినిమా చేయొచ్చు కదా అంటున్నారు. నేను ఇదే కథను ఏ భాషలో కావాలన్నా ఎన్నిసార్లు చేయమన్నా ఆనందంగా చేస్తాను. చేసిన సినిమానే కదా, మళ్లీ ఏం చేస్తాంలే అనుకోను. ఒకవేళ హిందీలో కాని, తమిళ్లో కాని రీమేక్ చేసే అవకాశం వస్తే తెలుగులో నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా ఇంకా బాగా చేస్తాను. నేను దర్శకత్వం వహించే సినిమాలకు నేనే కెమెరామెన్‌గా పనిచేస్తే దర్శకునిగా నాకేం కావాలో అలా చేసుకోగలుగుతాను. నాలోని డైరెక్టర్‌కి, కెమెరామెన్‌కి క్లాష్ ఉండదు. మంచి అవుట్‌పుట్ ఇస్తాను. ప్రస్తుతం తమిళ్లో కెమెరామెన్‌గా చరణ్ దర్శకత్వంలో ఓ సినిమాకు పనిచేస్తున్నా. తెలుగులో దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే కథతో...
‘మహానటి’ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కీర్తీ సురేశ్‌పై అభిమానం అమాంతం పెరిగింది. ఇప్పుడు ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటించనున్నారామె. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నరేంద్ర దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మించనున్నారు. ఈ సినిమా ముహూర్తం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, దర్శకుడు వెంకీ అట్లూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో కల్యాణ్ రామ్ క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్‌కి దర్శకుడు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో ‘మహానటి’ తర్వాత నటిస్తోన్న సినిమా ఇది. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే చిత్రమిది. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనుంది. దర్శకుడు నరేంద్ర మంచి కథ సిద్ధం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘2016 నుంచి ఈ కథను తయారు చేస్తున్నాను. అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఈ పాత్రకు కీర్తీగారు తప్ప ఇంకెవరూ సూట్‌కారు. 75శాతం షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు దర్శకుడు నరేంద్ర. ‘‘మహానటి’తో కీర్తి తెలుగు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి అమ్మాయి ఏదో సందర్భంలో ఎదుర్కొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. మిగతా నటీనటులను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి పాల్గొన్నారు. -
బాగా నటించాడ్రా అంటే చాలు
‘‘కల్యాణ్ అన్నను చూస్తుంటే మూడేళ్ల కిందట నేను పడిన టెన్షన్ ఆయనలో కనిపిస్తోంది. నేను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసినప్పుడు.. ముఖ్యంగా ఆ గెటప్ ఛేంజ్ చేసినప్పుడు.. అప్పటి వరకూ నేను చేసిన సినిమాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనిపించింది. ప్రతి నటుడూ స్టీరియో టైప్ పాత్రలు, సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే ఆ నటుడికే కాదు.. అభిమానులు, ప్రేక్షకులకూ సంతృప్తి ఉండదు’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఓ నటుడిగా సినిమా హిట్ అయిందా? లేదా? అన్నదానికంటే ‘బాగా నటించాడ్రా’.. అనే చప్పట్లే ఎంతో ముఖ్యం. కొత్తగా ట్రై చేసినప్పుడు ఈ టెన్షన్లు సర్వసాధారణం. కానీ మీరు (కల్యాణ్‌రామ్) టెన్షన్ పడాల్సిన పనిలేదు. మన ప్రేక్షక దేవుళ్లది, మన అభిమానులది చాలా పెద్ద హృదయం. జెన్యూన్‌గా కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి పెద్ద పీట వేయడం ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్తేమీ కాదు. అలాంటి కోవకు చెందిన చిత్రాల్లో ‘నా నువ్వే’ కూడా తప్పకుండా నిలుస్తుందని నా నమ్మకం. మీరు పడిన కష్టం, టెన్షన్ వృథా పోదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత గంట మాట్లాడతానని అన్న చెప్పారంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతోంది. ఆ కాన్ఫిడెన్స్ యాక్టర్‌కి అవసరం. జయేంద్ర సార్‌కి చాలా గట్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఓ ఛాలెంజ్‌లా భావించి చేశారాయన. షరెత్గారి కెరీర్లో ‘నా నువ్వే’ బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. అనంత శ్రీరామ్‌గారు చక్కటి సాహిత్యం అందించారు. ఈ సినిమా నిర్మాతలు విజయ్‌గారు, కిరణ్‌గారు, మహేశ్‌లకు థ్యాంక్స్. ఇలాంటి ఓ ప్రయత్నం చేసేటప్పుడు చాలా దమ్ముండాలి. రిజల్ట్ గురించి మాట్లాడుకోకుండా కథను నమ్మి ఈ సినిమా తీశారు. ఈ చిత్రం అందరి కెరీర్లో.. ముఖ్యంగా మా కల్యాణ్ అన్న కెరీర్లో మైలురాయిగా నిలిచిపోవాలి. ఇంకా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఆయన చేయాలి. మరిన్ని ప్రయోగాలు చేసే ఎంకరేజ్మెంట్ ఈ సినిమా అన్నకు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. జయేంద్ర మాట్లాడుతూ– ‘‘నిర్మాతలకి లాస్ ఏంజెల్స్‌లో ‘నా నువ్వే’ కథ చెప్పాను. వెంటనే సినిమా చేద్దామన్నారు. కల్యాణ్‌రామ్‌గారు నాపై నమ్మకంతో ఒకే సిట్టింగ్‌లో కథ ఓకే చేశారు. ఇప్పటి వరకూ ఆయన యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఇది రొమాన్స్ జానర్లో ఉంటుంది. 14న సినిమా చూశాక ప్రేక్షకులు కల్యాణ్‌రామ్‌ని ‘వాట్ ఏ లవర్ బోయ్’ అంటారు. గత చిత్రాలకంటే ఈ చిత్రంలో తమన్నా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఈ చిత్రంలో రెండు పెద్ద సర్‌ప్రైజ్‌లున్నాయి. ఒకటి కల్యాణ్ మేకోవర్, రెండోది తమన్నా పాత్ర. ఇది పూర్తి రొమాంటిక్ ఫిల్మ్ కాదు. యువతరంతో పాటు కుటుంబ సభ్యులందరూ కలసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. సమర్పకులు మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ఎక్స్ట్రా స్పెషల్ అని చాలాసార్లు చెప్పా. సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో కొత్త కల్యాణ్‌రామ్‌గారు కనిపిస్తారు. మాస్ హీరోగా ఇప్పటికే మార్క్ తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్‌కి మరింత దగ్గరవుతారని చాలా నమ్మకంగా ఉంది’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నా నువ్వే’ చిత్రం పాటలు చాలా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చినందుకు షరెత్ సార్‌కి థ్యాంక్యూ. ‘నా నువ్వే’ థీమ్ సాంగ్ ఇప్పటికీ రోజుకి పదిసార్లు వింటూ ఉంటాను. జయేంద్రగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. అప్పుడు ఆయన్ని ఒక్కటే ప్రశ్న అడిగా. ఈ రోల్‌కి నేను ఎలా సరిపోతారని మీరు భావిస్తున్నారు? అని. నా కెరీర్లో నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశా. ఎక్కువమంది అటువంటి చిత్రాలతోనే నన్ను కలుస్తున్నారు. ఇదొక ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఫిల్మ్. నేనెప్పుడూ ఇలాంటి చిత్రం చేయలేదు. అప్పుడు ఆయన నాతో అన్నారు. ‘ఓ రొమాంటిక్ హీరోతో రొమాంటిక్ సినిమా చేయొచ్చు. దట్స్ సింపుల్ అండ్ ఈజీ. కానీ ప్రేక్షకులకు ఏం కొత్తగా ఉంటుంది? కానీ, ఇప్పటి వరకూ మీరు చేయని ఈ రోల్ చేసి ప్రేక్షకులకు నచ్చితే అది నాకు పెద్ద సక్సెస్’ అన్నారు. నాపై ఆయన నమ్మకం చూసి ఈ సినిమా చేశా. నా వద్దకి ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడంతో పాటు పెద్ద టెక్నీషియన్స్, పెద్ద హీరోయిన్ని తీసుకొచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. చాలా ఏళ్లుగా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తున్నారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదు. నా ఈ ప్రయత్నాన్ని మీరు మళ్లీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. సినిమా విడుదలయ్యాక గంట సేపు మాట్లాడతా. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో తారక్ టోటల్‌గా ఛేంజోవర్ అయ్యాడు. నేను కూడా ఇలా ఓ సినిమాకి చేయాలనుకున్నా. ఆ దేవుడు, మా తాతగారు (ఎన్టీఆర్) విని, నాకు ఈ సినిమా ఇచ్చారని నమ్ముతున్నా’’ అన్నారు. చిత్రనిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు షరెత్, పాటల రచయిత అనంత శ్రీరామ్, నిర్మాతలు నాగవంశీ, పీడీవీ ప్రసాద్, విజయ్ చిల్లా తదితరులు పాల్గొన్నారు. -
హృదయాన్ని హత్తుకునేలా...
కల్యాణ్ రామ్, తమన్నాలను సరికొత్త డైమన్షన్‌లో చూపించే చిత్రం ‘నా నువ్వే’. ఇద్దరూ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారు. హృదయాన్ని హత్తుకునే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘నా నువ్వే’’ అన్నారు చిత్ర నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వటికూటి. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా దర్శకుడు జయేంద్ర రూపొందించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘నా నువ్వే’. మహేశ్ కోనేరు సమర్పణలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్, కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వటికూటి నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ–‘‘జయేంద్రగారు అద్భుతమైన ఫీల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పీసీ శ్రీరామ్‌గారు ప్రతీ ఫ్రేమ్‌ను ఎక్స్ట్రాడినరీగా చూపించారు. శరత్ సంగీతానికి మంచి స్పందని లభిస్తోంది’’ అని అన్నారు. -
కళ్యాణ్‌రామ్ `నా నువ్వే' ట్రైలర్ రిలీజ్
-
అదే బ్యానర్లో మరో సినిమా
త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కల్యాణ్ రామ్.. తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు. ఏప్రిల్ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను కూడా నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే నిర్మించనున్నారు. జల్సా, దూకుడు, ఆగడు లాంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నా నువ్వే మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. -
అందుకే ‘ఎంఎల్ఎ’ కథ ఎంచుకున్నా
‘‘నా పేరు ఉపేంద్ర రెడ్డి. మా బ్రదర్ పేరు మాధవ్ రెడ్డి. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన లేకుంటే ఇండస్ట్రీలో నేను ఇన్నేళ్లు ఉండేవాణ్ని కాదు. అందుకే నా పేరుకి మా బ్రదర్ పేరు యాడ్ చేసుకుని ఉపేంద్రమాధవ్ అని పెట్టుకున్నా’’ అని ఉపేంద్ర మాధవ్ అన్నారు. కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎంఎల్ఏ’. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ– ‘‘మాది గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులోని జొన్నలగడ్డ. దర్శకుడు కావాలనే హైదరాబాద్ వచ్చా. ప్రియదర్శిని రామ్‌గారి వద్ద ‘మనోడు, టాస్’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశా. ఆయన వద్దే యాడ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసేవాణ్ని. నా ఫ్రెండ్ సాయి ద్వారా ‘దూకుడు’ సినిమాలో స్క్రిప్ట్ విభాగంలో అసోసియేట్‌గా పనిచేసే చాన్స్ వచ్చింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద, యాక్షన్ త్రీడీ, బాద్షా, ఆగడు, బ్రూస్లీ’ చిత్రాలకు రచనా విభాగంలో పనిచేశా. ‘బ్రూస్లీ’ తర్వాత సొంతంగా కథలు రాసుకోవడం మొదలుపెట్టా. శ్రీనువైట్లగారితో బాగా ట్రావెల్ అయ్యేవాణ్ని. ఓ కమర్షియల్ సినిమాతోనే లాంచ్ కావాలని ‘ఎంఎల్ఎ’ కథ ఎంచుకున్నా. ‘పటాస్’ సినిమా టైమ్‌లో అనిల్ రావిపూడి ద్వారా కల్యాణ్‌రామ్‌తో పరిచయం అయింది. మంచి కథ తీసుకురా సినిమా చేద్దామన్నారు ఆయన. రెండేళ్ల తర్వాత ‘ఎంఎల్ఎ’ కథ ఆయనకు వినిపించడం, నచ్చడం, సినిమా మొదలవడం జరిగిపోయాయి. ఈ కథ బాగుందని శ్రీనువైట్లగారు కూడా అభినందించారు. సినిమా విడుదలయ్యాక చాలామంది దర్శకులు ఫోన్ చేసి ‘మంచి కథ. బాగా తీశావ్’ అని మెచ్చుకున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నా రెండో సినిమా కూడా పీపుల్ మీడియా, బ్లూ ప్లానెట్ బ్యానర్స్‌లోనే ఉంటుంది’’ అన్నారు. -
ఒక్క సినిమా చేసి వెనక్కి వెళ్లిపోదామనుకున్నా
‘‘కల్యాణ్ రామ్‌తో పదేళ్ల కిందట ‘లక్ష్మీకళ్యాణం’ సినిమా చేశా. ‘ఎంఎల్ఏ’ చిత్రంలో మళ్లీ తనతో నటించడం నా పాత స్నేహితుణ్ని కలిసినట్లు అనిపించింది. ఎవరి వ్యక్తిగత జీవితాలు, సినిమాలతో బిజీగా ఉన్నాం. ఈ పదేళ్లలో ఓ పబ్లిక్ ఫంక్షన్లో ఇద్దరం కలిశామంతే. మధ్యలో ఎప్పుడూ కలవలేదు’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. కల్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎంఎల్ఏ’. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భం గా కాజల్ పంచుకున్న విశేషాలు... ► ఆసక్తికరమైన సినిమాలు చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే.. ఓ నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలనుకున్నా. కమర్షియల్ సినిమాలు, కొత్త తరహా సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. ► ‘ఎంఎల్ఏ’లో నాది ఎన్నారై అమ్మాయి పాత్ర. స్ట్రాంగ్ క్యారెక్టర్. నా పాత్రలో ఓ షేడ్ ఉంటుంది. నేనెందుకు అలా చేస్తుంటాననే విషయం ఇంటర్వెల్ వరకూ తెలియదు. దానికి కారణాలేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ► ఎంటర్‌టైనింగ్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. కొత్తదనం ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. నా పాత్రలకు న్యాయం చేయడానికి సిన్సియర్‌గా కృషి చేస్తున్నాను. నేను చేస్తున్న సినిమాలు, పాత్రల పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ► ‘లక్ష్మీ కల్యాణం’ చేసేటప్పుడు ‘ఒక సినిమా చేస్తే చాలు.. మానేసి వెనక్కి వెళ్లిపోయి ఎంబీఏ చదువుకుందామనిపించింది’. కానీ.. జీవితం వేరేలా ఉంటుంది కదా! ఈ ప్రయాణం హ్యాపీగా ఉంది. ఇంత మంచి లైఫ్ ఇచ్చి, వారి ఫ్యామిలీలో నన్ను ఒకరిగా భావించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ► తెలుగు చిత్ర పరిశ్రమలోనే ‘నాకు లైఫ్’ అని ఐదు సినిమాలు చేసిన తర్వాత అనిపించింది. ‘మగధీర’ సినిమా చేసేటప్పుడు ‘వందశాతం ఇదే నా లైఫ్’ అని అర్థమైంది. ప్రస్తుతం ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో నటిస్తున్నా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నా. ‘పక్కా లోకల్’ తర్వాత ఐటమ్ సాంగ్స్‌లో కనిపించడం లేదేంటని అడుగుతున్నారు. అది ఎప్పుడో ఒకసారి సరదాకి అలా చేస్తుంటాను అంతే. హిందీ సినిమా చేశామంటే ఏదో ఒక హిందీ సినిమా చేయటానికి వెళ్లినట్టు ఉండకూడదు. మంచి రోల్ ఉంటేనే చేస్తాను. నా పాత సినిమాల్ని చూసి ఎప్పుడూ సిగ్గుపడను. అరే ఆ సీన్ ఇలా చేశానేంటి? దాని బదులు ఇంకోలా చేసుంటే బావుండేది కదా అని ఫీల్ అవుతాను.. అంతే. ఆ హీరో ఈ హీరోతో అని కాదు ఇండస్ట్రీలో అందరితో యాక్ట్ చేయాలని ఉంది. చేసిన వాళ్లతో మళ్లీ మళ్లీ యాక్ట్ చేయాలనుంది. కల్యాణ్ రామ్ ఎంత మంచి ‘ఎంఎల్ఏ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అంటే నేను పదికి ఎనిమిదిన్నర మార్కులు ఇస్తాను. పక్కా ఫ్యామిలీ మ్యాన్. -
కాంబినేషన్ కాదు... కథే ముఖ్యం – కల్యాణ్ రామ్
‘‘కాంబినేషన్ కంటే కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలంటే ఇష్టం. అలాంటి వారిలో ‘ఎంఎల్ఏ’ చిత్రనిర్మాతలు ముందుంటారు. తప్పకుండా వీరు పెద్ద నిర్మాతలు అవుతారు’’ అన్నారు కల్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కాజల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఎంఎల్ఏ’. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘పటాస్’ కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో ‘ఎంఎల్ఏ’ కథ విన్నప్పుడూ అంతే ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో ఉపేంద్ర నన్ను కొత్తగా చూపించాడు. ‘పటాస్, ఇజం’ సినిమాలు చేస్తున్నప్పుడు ఎంత బాగా ఫీలయ్యానో.. ఈ సినిమాకూ అలాగే ఫీలయ్యాను. కొత్త దర్శకుడిని గైడ్ చేయాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్‌ది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ది భార్య, భర్తల బంధం. నేను పనిచేసిన కెమెరామెన్స్‌లో బెస్ట్ కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్లగారు. కాజల్‌తో రెండో చిత్రమిది. ఇప్పటివరకూ నేను పధ్నాలుగు సినిమాలు చేస్తే.. తను 50 సినిమాలు చేసింది. అందుకు కారణం తన డెడికేషన్’’ అన్నారు. ‘‘రియల్ లైఫ్‌లో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యే అవడం ఎంత కష్టమో నాకు తెలియదు. కానీ, ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా డైరెక్టర్ అవడం ఎంత కష్టమో తెలుసు. ఉపేంద్ర నా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసు. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ‘‘తన బాధ్యతను ఎక్కువగా ప్రేమించే డైరెక్టర్స్‌లో ఉపేంద్ర ఒకరు. సాలూరి రాజేశ్వరరావు తర్వాత ఆ స్థాయిలో సంగీతం అందించగల మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మగారు’’ అన్నారు బ్రహ్మానందం. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డి.సురేశ్ బాబు. ‘‘కల్యాణ్ రామ్‌గారికి ‘ఎంఎల్ఏ’ టైటిల్ చక్కగా యాప్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు ఎన్.శంకర్. ‘‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలోనే ఉపేంద్ర ఈ కథ చెప్పారు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో కల్యాణ్ రామ్. చేతికి గాయమైనా కమిట్మెంట్తో సినిమాను పూర్తి చేశారు’’ అని కిరణ్ రెడ్డి అన్నారు. ‘‘కథ వినగానే సినిమా చేస్తున్నాం అన్నారు కల్యాణ్ రామ్‌గారు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ అయింది. మణిశర్మగారు పాటలు ఎంత బాగా చేశారో.. రీ–రికార్డింగ్ అంత కంటే బాగా చేశారు’’ అన్నారు ఉపేంద్ర మాధవ్. పోసాని, రవికిషన్, కోన వెంకట్, వీఎన్ ఆదిత్య, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్క్ హార్డ్... సక్సెస్ విల్ ఫాలో
‘‘కొత్త దర్శకులతోనే సినిమాలు చేయాలని అనుకోలేదు. స్క్రిప్ట్‌లో జెన్యూనిటీ కనిపిస్తే న్యూ డైరెక్టరా? ఎస్టాబ్లిష్డ్ డైరెక్టరా? అని ఆలోచించను. సినిమా చేసేస్తాను’’ అన్నారు కల్యాణ్ రామ్. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ’. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ ఎల్.ఎల్.పి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మార్చి 23న విడుదల కానుంది ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ చెప్పిన విశేషాలు. ► పోలింగ్ (సినిమా విడుదలను ఉద్దేశించి) దగ్గర పడింది.ఈ పోలింగ్‌లో విశేషమేంటంటే రిజల్ట్ కూడా అదే రోజు వచ్చేస్తుంది. సినిమా టైటిల్లోనే హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ► సినిమా పొలిటికల్ డ్రామానే బట్ పూర్తిగా పాలిటిక్స్ గురించి మాట్లాడం. లవ్ స్టోరీతో బిగిన్ అయి సెకండ్ హాఫ్ పాలిటిక్స్ వైపు మళ్లుతుంది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ గురించి కూడా డిస్కస్ చేశాం. ► ఉపేంద్ర మాధవ్ రైటర్ అవ్వటం వల్ల సినిమాలో డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. సినిమాలో నా డైలాగ్ డిక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ విషయంలో ఉపేంద్ర చాలా పర్టికులర్‌గా ఉన్నాడు. ► ‘ఏంటి ఇంత చెత్త సినిమా చేశాడు’ అనే రివ్యూ అయితే ఇప్పటివరకు రాలేదు. నా గురించి ఏమైనా బ్యాడ్ రివ్యూలు వస్తే వాటిని అనలైజ్ చేసుకొని వర్కౌట్ చేస్తాను. మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ‘వర్క్ హార్డ్.. సక్సెస్ విల్ ఫాలో’ అనే ఫిలాసఫీని నమ్ముతాను. సక్సెస్ కోసం పరిగెత్తినా కొన్నిసార్లు రాకపోవచ్చు. మనం ఏం చేసినా మనకు సంతృప్తిగా అనిపించాలి. ► సాయిధరమ్ తేజ్, నేను ఓ మల్టీస్టారర్ చేద్దాం అనుకున్నాం. బట్ స్క్రిప్ట్ కుదరకఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. స్క్రిప్ట్ నచ్చితే ఎవరితో అయినా మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను. ఈ జులైలో ఒక మల్టీస్టారర్ సినిమా అనౌన్స్ చేయనున్నాం. ► ప్రొడ్యూసర్‌గా నేనెప్పుడూ హ్యాపీనే. ‘ఈ సినిమా ఎందుకు చేశాను’ అని ప్రొడ్యూసర్‌గా ఎప్పూడు అనుకోలేదు. ఏంటి ఇంత తలనొప్పి సినిమా చేశాడు? అని ఆడియన్స్ కూడా అనుకోకూడదు. బయట ప్రొడక్షన్స్‌తో చేసేటప్పుడు అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేయాలని చూస్తాను. ► తారక్, నేను ఎక్కువగా సినిమాల గురించే మాట్లాడుకుంటాం.‘ఎం.ఎల్.ఎ’ ట్రైలర్ చూసి చాలా డిఫరెంట్‌గా ఉన్నావు, చాలా కాన్ఫిడెంట్‌గా కూడా కనిపిస్తున్నావు’ అన్నాడు. మా డిస్కషన్లో పాలిటిక్స్ రాదు. ఎక్కవగా కార్లు, గాడ్జెట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ► ఈ సినిమాలో ఎం.ఎల్.ఏ పలికిన సంభాషణలు కానీ టైటిల్ కానీ నా ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి ఏమీ ఇండికేషన్ ఇస్తున్నట్లు కాదు. ఇది సినిమాలో నా క్యారెక్టర్ మాత్రమే. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. ► నెక్ట్స్ ‘నా నువ్వే’ సినిమా చేస్తున్నాను. ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ‘జెమినీ’ కిరణ్ నిర్మించనున్న సినిమాను ఆదివారం ఉగాది రోజున అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘‘ చక్కని కుటంబ నేపథ్యం ఉన్న చిత్రమిది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత. -
ఎమ్మెల్యే వినోదం
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా విడుదలైన పదకొండేళ్లకు కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన చిత్రం ‘ఎంఎల్ఎ’. ‘మంచి లక్షణాలున్న అబ్బాయ్’ అన్నది ఉపశీర్షిక. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, సురేశ్ ప్రొడక్షన్స్ అసోసియేషన్‌లో గతేడాది విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. పీపుల్ మీడియా అసోసియేషన్‌లో చేసిన ‘ఎంఎల్ఎ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23న సినిమా విడుదల చేస్తాం. మా బ్యానర్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ కంటే ‘ఎంఎల్ఎ’ ఇంకా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘టైటిల్‌ని చూసి ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అనుకోవద్దు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. తొలిభాగం కార్పొరేట్ నేపథ్యంలో, రెండో భాగం రూరల్ నేపథ్యంలో సాగుతుంది. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, కల్యాణ్‌రామ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు ఉపేంద్ర మాధవ్. చిత్రసమర్పకులు విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. ∙కల్యాణ్ రామ్, కాజల్ -
ప్రయోగాత్మక చిత్రంలో నందమూరి హీరో
ప్రస్తుతం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఎమ్మెల్యే సినిమాతో పాటు రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న నా నువ్వే సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలను సమ్మర్ సీజన్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ రామ్ ఓ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్, రొమాంటిక్ స్టోరీలు మాత్రమే చేసిన కళ్యాణ్ రామ్ త్వరలో థ్రిల్లర్ సినిమా చేసేందుకు అంగీకరించాడు. విజయ్ మద్దలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా చేసేందుకు కళ్యాణ్ రామ్ అంగీకరించాడట. దర్శకుడు కథ చెప్పిన విదానంతో పాటు కథలోని మలుపుకు కూడా నచ్చటంతో వెంటనే ఈ నందమూరి హీరో ఒకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాన్ రామ్. జై లవకుశ సినిమాతో నిర్మాతగా ఘనవిజయం సాధించిన ఈ నందమూరి హీరో కథ ఎంపికలో కొత్తదనం చూపిస్తున్నాడు. -
లెట్స్ డూ ట్యాంగో
కత్తి యుద్ధం నేర్చుకోవాలా? గుర్రపు స్వారీ నేర్చుకోవాలా? బస్తీ మే సవాల్.. నేర్చేసుకుంటా అంటూ ‘బాహుబలి’ సినిమా కోసం తమన్నా ఆ రెంటిలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మరో చాలెంజ్‌కి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఫైట్ కోసం కాదండి. సాంగ్ కోసం. తమన్నా ఓ కొత్త డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ తెగ శ్రమిస్తున్నారట. చిన్న చిన్న గాయాలు కూడా చేసుకున్నారట. తమన్నాను ఇంతలా ఇబ్బంది పెడుతున్న డాన్స్ పేరేంటంటే ‘ట్యాంగో’. ఈ ట్యాంగో డాన్స్ ఏంటా అనుకుంటున్నారా? పార్టనర్స్‌తో కలిసి చేసే డ్యాన్స్‌ను ట్యాంగో డాన్స్ అంటారు. కొంచెం జిమ్నాస్టిక్స్ టచ్ డ్యాన్స్‌లో కనిపిస్తుంది. అమెరికన్, యూరోపియన్ కంట్రీస్‌లో ఈ డాన్స్ బాగా ఫేమస్. ఏ సినిమా కోసం తమ్మూ నేర్చుకుంటున్నారంటే.. కల్యాణ్ రామ్ హీరోగా ‘180’ ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా నువ్వే’. ఈ సినిమా కోసమే ట్యాంగో డాన్స్ నేర్చుకుంటున్నారు తమన్నా. సినిమాలో వచ్చే ఓ ప్రత్యేకమైన సాంగ్ కోసం నృత్య దర్శకురాలు బృంద ఆధ్వర్యంలో తమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారట. ‘‘ట్యాంగో డాన్స్‌ను తొలిసారి ప్రయత్నిస్తున్నాను. అనుకున్నంత సులువుగా ఏం లేదు. ప్రాక్టీస్‌లో చిన్న చిన్న గాయాలు కూడా చేసుకున్నాను. కానీ బృందా మాస్టర్ హెల్ప్ వల్ల ఈ డ్యాన్స్ స్టైల్‌ను నేర్చుకోగలిగాను’’ అని తమన్నా పేర్కొన్నారు. -
వేసవికి నువ్వే
కల్యాణ్‌రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వంలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘నా.. నువ్వే’ టైటిల్ ఖరారు చేశారు. నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి మాట్లాడుతూ –‘‘సరికొత్త కథాంశంతో, ఫ్రెష్ లుక్‌తో జయేంద్రగారు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరుకి షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ‘నా.. నువ్వే’ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. కల్యాణ్ రామ్, తమన్నాల కాంబినేషన్ ఈ చిత్రానికే హైలైట్. పి.సి. శ్రీరామ్‌గారి కెమెరా వర్క్ ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా రూపొందుతోన్న చిత్రమిది. పి.సి. శ్రీరామ్, జయేంద్ర వంటి టాప్ క్వాలిటీ టెక్నికల్ టీమ్‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నాం. వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని సమర్పకుడు మహేష్ కోనేరు అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ‘బిత్తిరి’ సత్తి, ప్రియ, సురేఖవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: షరెత్. -
ట్యాప్ గుర్తుకు ఓటేయండి!
ప్రతి ఊరు... ప్రతి ఇల్లు... నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. ‘ట్యాప్ గుర్తుకు ఓటేయండి’ అని ప్రజల్ని కోరుతున్నారు. ట్యాప్ గుర్తుకు ఓటేయడం ఏంటి? ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరారా? లేదా కొత్తగా పార్టీ ఏదైనా ప్రారంభించారా? అని ఏవెవో ఊహించుకోకండి! ఎందుకంటే... ఆయన ఓట్లు వేయమంటున్నది రీల్ లైఫ్‌లోనే! ఉపేంద్ర మాధవ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఎమ్మెల్యే’. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి... అనేది ఉపశీర్షిక. ఇటీవలే ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఉన్నారు. ‘‘వీరభద్రాపురం నియోజకవర్గ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓట్లు వేసి అత్యంత మెజారిటితో గెలిపించ ప్రార్థన. మీ కల్యాణ్! ట్యాప్ గుర్తుకే మన ఓటు’’ అని రాసిన వాల్ పోస్టర్లు, పాంప్లెట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ ఎమ్మెల్యేగా నటించబోతున్నారని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. వీరభద్రాపురం అనే విలేజ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో ఉంది. సో... గోదావరి అందాలను ఈ సినిమాలో చూడొచ్చని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు.