గోదావరిలో రిస్క్‌ | Kalyan Ram New Movie Entha Manchivadavura Releasing On January 15 | Sakshi
Sakshi News home page

గోదావరిలో రిస్క్‌

Published Wed, Nov 27 2019 12:49 AM | Last Updated on Wed, Nov 27 2019 12:49 AM

 Kalyan Ram New Movie Entha Manchivadavura Releasing On January 15 - Sakshi

కల్యాణ్‌రామ్, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఆదిత్యా మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరి 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్‌లు ఉంటాయి. పాటలను డిసెంబర్‌లో విడుదల చేస్తాం. ఈ సినిమాకి గోపిసుందర్‌ సంగీతదర్శకుడు. సీతారామ శాస్త్రి, శ్రీమణి చెరో పాట రాయగా రామజోగయ్య శాస్త్రి రెండు పాటలను రాశారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ను చాలా రిచ్‌గా తీశాం. ఈ ఫైట్‌ను గోదావరి నదిలో ఎంతో రిస్క్‌తో ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ తెరకెక్కించారు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement