Meharin
-
మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్పార్క్. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి విక్రాంత్ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. దాదాపు విడుదలైన పది నెలల తర్వాత సన్ నెక్ట్స్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు.స్కార్క్ కథేంటంటే?లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్‌గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు.పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్‌గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్‌కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
ప్రేమ ప్రభావం
నిఖిల్ దేవాదుల (‘బాహుబలి’ ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘15–18–24 లవ్‌స్టోరీ’. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను కథానాయిక మెహరీన్ చేతుల మీదగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. 15–18–24 వయసులలో ప్రేమ, దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్‌గా నిలుస్తుంది. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో ఈ ఫైట్‌ని చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బీవీ శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్. -
అందుకే ఆ ట్యాటూ వేయించుకున్నా
‘‘నటుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటాను. ‘లవర్ బాయ్’ ట్యాగ్ మాత్రమే ఇష్టపడను. అన్నీ లవ్‌స్టోరీలే చేసుకుంటూపోతే రోజూ ఒకలాంటి పనే చేస్తున్న భావన కలగడం సహజం. ప్రతిరోజూ సెటికి వెళ్లడం హీరోయిన్‌కి రోజా పువ్వు ఇవ్వడం, పాటలు పాడటమే చేస్తున్నట్టుంది. హీరోయిన్లు మారుతున్నారు కానీ అదే పువ్వు ఇస్తున్నట్టుంది. శౌర్య ఇది కూడా చేస్తాడు అని ‘అశ్వథ్థామ’ సినిమా నిరూపిస్తుంది’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథ సమకూర్చి హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణతేజ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య పంచుకున్న విశేషాలు. ►ప్రస్తుతం అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యల ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. విజయవాడ, సంగారెడ్డి, పంజాబ్, ఢిల్లీ వంటి ప్రదేశాలు తిరిగి బాధిత కుటుంబాలతో కలసి చాలా విషయాలు మాట్లాడాను. కథ రాయడం పూర్తయ్యేసరికల్లా నాకు జీవితంలో చాలా విషయాలపై అవగాహన వచ్చిందనే ఫీలింగ్ కలిగింది. అందుకే ‘ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను’ అని ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను ►ఇందులో విలన్ పాత్ర మాత్రమే కల్పితం. మిగతా సంఘటనలన్నీ మా పరిశోధనలో తెలిసినవి, విన్నవే ఉంటాయి. విలన్ పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. అతన్ని ఎదుర్కోవడానికి హీరో పవర్‌ఫుల్‌గా ఉండాలి. ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు తప్పు అని చెప్పింది అశ్వథ్థామ ఒక్కడే. ఈ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బావుంటుంది అని పెట్టాం. సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. పవన్‌కల్యాణ్‌గారి ‘గోపాల గోపాల’ సినిమాలో డైలాగ్‌తో ఈ సినిమా మొదలవుతుంది ►తమిళ సినిమాలు ‘రాక్షసన్, ఖైదీ, ఖాకీ’ తరహాలో ఈ సినిమా ఉంటుంది. చాలా నిజాయితీగా ఈ కథ చెప్పాం. సినిమా నచ్చి జిబ్రాన్ నేపథ్య సంగీతం అందిస్తా అన్నారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒకలాంటి నిశ్శబ్దం ఇంటిని చుట్టేస్తుంది. ‘నర్తనశాల’ ఫ్లాప్ తర్వాత ఆరునెలలు అలాంటి నిశ్శబ్దంలోనే ఉన్నాను. మా అమ్మానాన్నలు కష్టపడి నిర్మిస్తే వాళ్లు తలెత్తుకోకుండా చేశానే అనే ఫీలింగ్ ఉంది. వాడికి హిట్ ఇవ్వలేదు అని వాళ్లు ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ దర్శకుడికి ఇచ్చిన మాట కోసం ఆ సినిమా చేశాను. మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని నమ్ముతాను ►‘నర్తనశాల’ సినిమా తర్వాత మళ్లీ కొత్తవాళ్లతో సినిమా ఎందుకు అన్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ సమయంలో నేనూ కొత్తవాణ్నే. కానీ నన్ను నమ్మి సినిమా అవకాశం ఇచ్చారు కదా. అవకాశం ఇచ్చే వీలు ఉన్నప్పుడు కొత్త టాలెంట్ ప్రోత్సహించాలని నమ్ముతాను ►ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చేస్తున్నాను. అందులో 7 గెటప్స్‌లో కనిపిస్తాను. ఆ తర్వాత నందినీ రెడ్డి, సౌజన్య దర్శకత్వంలో సినిమాలు చేస్తాను. ప్రస్తుతం సినిమాలతోనే ప్రేమలో ఉన్నాను. ఓ లవ్‌స్టోరీ రాస్తున్నాను. మా బ్యానర్లోనే నిర్మిస్తాం. ఈ సినిమాలో నేను నటించను. బయట హీరో చేస్తారు. ‘అశ్వథ్థామ’ కథ చాలా ఎమోషనల్‌గా ఉండటంతో మానసికంగా శ్రమ అనిపించేది. కానీ అవుట్‌పుట్ సంతృప్తికరంగా అనిపించింది. అందుకే రిలీజ్ కాకముందే ‘అశ్వథ్థామ’ అని గుండెల మీద ట్యాటూ వేయించుకున్నాను. -
వాస్తవ సంఘటనల అశ్వథ్థామ
నాగసౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ రేపు (గురువారం) సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు. ‘‘సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో నాగశౌర్య ఈ సినిమా కథని రాసుకున్నారు. హీరోయిన్ సమంత ఇటీవల విడుదల చేసిన మా సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా అందరి అంచనాలకు తగ్గట్టు ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి. -
ఆ ముద్ర వేయడం సంతోషం
‘‘భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని రాసే కథలకు ఫలానా హీరోనే చేయాలి అనేది ఉండదు. కథే హీరో. అలాంటి కథని సినిమాగా చేసేటప్పుడు హీరోనే కథను మోసుకుంటూ వెళ్తాడు. మా సినిమా హీరో కల్యాణ్‌రామ్ ‘ఎంత మంచివాడవురా’ కథకు కావాల్సినంత న్యాయం చేశాడు’’ అని డైరెక్టర్ వేగేశ్న సతీష్ అన్నారు. కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వేగేశ్న సతీష్ చెప్పిన విశేషాలు... ►ఒకే జోనర్లో సినిమాలు చేసే హీరో ఒక్కసారిగా జోనర్ మారితే ఆ హీరో ఎలా చేశాడు? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఉంటుంది. కల్యాణ్‌రామ్ ఎలా చేసుంటాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఉంటుంది. అదే మా సినిమాకు ప్లస్ పాయింట్. మా కథకు అభినయం పరంగా పరిణితి కనబరచే నటుడు కావాలనుకొని ఆయనకు కథ చెప్పాను.. నచ్చటంతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. కథానుగుణంగా ఈ సినిమాలో ఫైట్లు ఉంటాయి.. అవి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ►కెరీర్లో నేను చేసిన రెండు సినిమాలతోనే ఫ్యామిలీ దర్శకుడు అనే ముద్ర వేశారు. ఆ బ్రాండ్ నాకు సంతోషాన్నే ఇస్తోంది. ►స్వతహాగా కథా రచయితనైనా ఏ రోజూ రీమేక్ కథలు చేయాలనుకోలేదు. ‘ఆక్సిజన్’ అనే గుజరాతి సినిమా చూసిన మా నిర్మాతలు ఈ సినిమా రీమేక్ చేస్తే బావుంటుందని శివలెంక కృష్ణప్రసాద్‌గారికి చెప్పారు. ‘సతీష్ వద్దే చాలా కథలు ఉన్నాయి.. రీమేక్ కథ చేస్తాడో? లేదో? డౌటే.. అయినా ఓ సారి అడిగిచూడండి’ అని శివలెంకగారు నిర్మాతలతో అనటంతో నిర్మాతలు నన్ను అడిగారు. సినిమా చూసినప్పుడు ఆ కథలోని హీరో క్యారెక్టర్ నన్ను ఆకర్షించింది. కానీ మిగతా సినిమా మన తెలుగు నేటివిటీకి సరిపోదని చెప్పాను. ఆ తర్వాత నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఈ కథలో మార్పులు చేశాం. సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి. -
గోదావరిలో రిస్క్
కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరి 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి. పాటలను డిసెంబర్లో విడుదల చేస్తాం. ఈ సినిమాకి గోపిసుందర్ సంగీతదర్శకుడు. సీతారామ శాస్త్రి, శ్రీమణి చెరో పాట రాయగా రామజోగయ్య శాస్త్రి రెండు పాటలను రాశారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ను చాలా రిచ్‌గా తీశాం. ఈ ఫైట్‌ను గోదావరి నదిలో ఎంతో రిస్క్‌తో ఫైట్ మాస్టర్ వెంకట్ తెరకెక్కించారు’’ అన్నారు. -
జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది
‘‘లైఫ్ అంటేనే స్ట్రగుల్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్ట్రగుల్ ఉంటుంది. నా లైఫ్‌లో కూడా. ప్రతి రోజూ మన జీవితం మనకు ఎంతో కొంత నేర్పుతుంది. మనకు మనం నిజాయతీగా ఉండటం ముఖ్యం. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు నా దృష్టిలో సరైనవే. కానీ అన్నిసార్లు మన నిర్ణయాలు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాంటి అనుభవాలను లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకుంటాను’’ అన్నారు మెహరీన్. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రంలో మెహరీన్, జరీనాఖాన్ కథానాయికలుగా నటించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన సంగతులు. ►తెలుగులో ‘చాణక్య’ నా 11వ సినిమా. ఈ సినిమాలో నేను ఐశ్యర్య అనే పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలీ, సునీల్, రఘుబాబు గార్లతో మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇది స్పై థ్రిల్లర్. నా క్యారెక్టర్లో ట్విస్ట్‌లు ఉండవు. కానీ హీరో క్యారెక్టర్లో ఉన్న ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి. హీరో క్యారెక్టర్‌కు ఐశ్వర్య ఎలాంటి సహాయం చేసిందనే అంశాలు సినిమాలో ఆసక్తికరం. ఐశ్వర్య పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోలేదు. భవిష్యత్‌లో తప్పక ప్రయత్నిస్తాను. ►ఒక ఆర్టిస్టుగా ప్రతి సినిమా ఆడాలనే కోరుకుంటాను. ఐశ్వర్య పాత్ర నా కెరీర్‌కి ఎంత ఉపయోగపడుతుంది? అనే విషయం నేను ఇప్పుడే చెప్పలేను. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. పాత్రకు పూర్తి న్యాయం చేయడమే నా బాధ్యత. ‘మహాలక్ష్మి (కృష్ణగాడి వీరప్రేమ గాథ’), హనీ (‘ఎఫ్ 2’) పాత్రలకు ఎలా కష్టపడ్డానో ఐశ్వర్య పాత్రకు అంతే కష్టపడ్డాను. ► స్పై థ్రిల్లర్స్ తీయడం అంత ఈజీ కాదు. తిరుగారు చాలా క్లారిటీ ఉన్న దర్శకులు. ఎలాంటి షాట్స్ కావాలో అవే తీసుకున్నారు. ‘పంతం’ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘చాణక్య’ సినిమాలో గోపీచంద్‌గారితో కలిసి నటించాను. మంచి కో–స్టార్. గోపీగారు తన పని తాను చూసుకుంటారు. ఓర్పు చాలా ఎక్కువ. నిర్మాతలు అనిల్ సుంకర, గోపీ, రామ్గార్లు నన్ను ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అనిల్‌గారు నేను ఎప్పుడు కనిపించినా మహాలక్ష్మీ అని పిలుస్తారు. అనిల్‌గారి బ్యానర్లో ‘చాణక్య’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ►స్క్రిప్ట్ తెలిసినప్పుడు అందులో మనల్ని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఆ పాత్రలో మనకి మనం నచ్చకపోతే ఆడియన్స్‌కు కూడా నచ్చకపోవచ్చు. అందుకే నాకు సంతృప్తినిచ్చే పాత్రలే చేయాలనుకుంటాను. నా తమ్ముడు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. నాకూ ఆసక్తి ఉంది. కానీ మంచి స్క్రిప్ట్ కుదరాలి. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాను. ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలే చేశాను. యాక్షన్ సినిమాలు చేయడం కూడా ఇష్టమే. అయితే మంచి కథ కుదరాలి. ►ప్రత్యేకంగా డ్రీమ్ రోల్ అనేది లేవు. అనుష్కగారు ‘అరుంథతి, బాహుబలి’, సమంతగారు ‘రంగస్థలం, ఓ బేబి’, కీర్తీ సురేష్ ‘మహానటి’ సినిమాల్లో అద్భుతంగా నటించారు. అలాంటి చాలెంజింగ్ రోల్స్ చేయడం ఇష్టం. ►నా మాతృభాష పంజాబీ. కానీ తెలుగు పరిశ్రమను నేను అమ్మలా భావిస్తాను. తెలుగు సినిమాలకే నా తొలిæప్రాధాన్యం. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌గారితో ‘ఎంత మంచివాడవురా’, నాగశౌర్యతో ‘అశ్వత్థామ’ చిత్రాలతో పాటు తమిళంలో ధనుష్గారితో ‘పటాస్’ సినిమాలో నటిస్తున్నాను. ఈ ఏడాది పంజాబీలో రెండు సినిమాలు చేశాను. ఒకటి రిలీజైంది. మరొకటి రిలీజ్ కావాల్సి ఉంది. కన్నడలో ఓ సినిమా చేయాల్సింది. కానీ చేతిలో ఎక్కవ సినిమాలు ఉండటంతో చేస్తున్న పాత్రలపై ఫోకస్ తగ్గుతుందని భావించి ఆ సినిమా ఒప్పుకోలేదు. మరో రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను. -
‘చాణక్య’ ట్రైలర్ ఆవిష్కరణ
-
గోపీచంద్ కెరీర్లో గేమ్ చేంజర్ మూవీ
‘‘ఏడాదిన్నర క్రితం తిరు ఈ కథ చెప్పినప్పుడు కొన్ని మార్పులు చెబితే చేశాడు. కథ అద్భుతంగా ఉంది. చెప్పిన కథను చెప్పినట్లుగానే తిరు అద్భుతంగా తీశాడు. అనిల్ సుంకరగారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని రాజీపడకుండా చాలా రిచ్‌గా నిర్మించారు. వెట్రితో నాకిది నాలుగో సినిమా. ఆయన ఫోటోగ్రఫీ బ్యూటిఫుల్. అబ్బూరి రవి డైలాగ్స్ ట్రెండీగా ఉంటాయి. ఈ సినిమాలో నాతో హిందీలో కూడా డైలాగ్స్ చెప్పించారు. రాజస్థాన్ ఎండలో, చలిలో మా టీం చాలా కష్టపడి చేశాం’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ హీరో హీరోయిన్లుగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘చాణక్య’. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్బంగా గురువారం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘స్పై బ్యాక్ డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘చాణక్య’ మా బేనర్‌కు ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది. తిరు చాలా టాలెంటెడ్. ఈ సినిమాకి మేం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద రెండింతలు కనపడేలా చేశారు. ఈ స్పై థ్రిల్లర్‌లో మంచి వినోదం కూడా ఉంది. గోపీచంద్ కెరీర్లో ఇది ఒక గేమ్ చేంజర్ మూవీ అవుతుంది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్ రాశారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి పాటలు రాశారు’’ అన్నారు. తిరు మాట్లాడుతూ – ‘‘సినిమా పై 100 శాతం నమ్మకంగా ఉన్నాం. ఇది నా మనసుకి బాగా నచ్చిన స్క్రిప్ట్. అనిల్ సుంకర గారు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు’’ అన్నారు. రచయితలు అబ్బూరి రవి, రామజోగయ్య శాస్త్రి, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండ, కో–ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణకిషోర్ గరికపాటి. -
పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత!
‘‘చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. అదే ఓ మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత’’ అంటున్నారు వెంకటేశ్. పెళ్లి చేసుకున్న వాళ్ల కష్టాల మీద సెటైరికల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ రోజు వెంకటేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఎఫ్ 2’ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని టీజర్ చెప్పేసింది. ‘సంక్రాంతికి గట్టిగా నవ్వించేట్టున్నారుగా?’ అని ఓ పాత్ర అడగ్గా. ‘అంతేగా.. అంతేగా..’ అంటూ నవ్వులు పంచారు వెంకీ, వరుణ్. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్. -
నిర్మాతంటే పదిమంది నిర్మాతలకి దారి చూపించాలి – కోడి రామకృష్ణ
‘‘పెళ్లి పందిరి’ సినిమాతో నా ప్రస్థానం మొదలైందంటూ రాజుగారు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఆ సినిమా రాజుగారికే కాదు చాలామందికి టర్నింగ్ పాయింట్. చలనచిత్ర రంగానికి ఈరోజు రాజుగారు గర్వంగా మిగిలారు. నిర్మాతంటే సక్సెస్ఫుల్ సినిమా తీయడం మాత్రమే కాదు. పదిమంది నిర్మాతలకి దారి చూపించాలి. సినిమా అంటే ఇలా తీయాలి అని చూపించాలి. రాజుగారు ఓ సంచలన నిర్మాత అయ్యారంటే దానికి కారణం కృషి, పట్టుదల. ఇలాంటివాళ్లు ఇండస్ట్రీలో ఉంటే చలనచిత్ర రంగం ఎప్పుడూ ఎవర్గ్రీన్’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ ఏడాది ‘శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, డీజే, రాజా ది గ్రేట్, ఎంసీఏ’ సినిమాలు వచ్చాయి. ఈ సందర్భంగా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సెలబ్రేటింగ్ 2017’ కార్యక్రమం నిర్వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది మా బేనర్ నుంచి వచ్చిన ఆరు సక్సెస్‌ల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ ఆరు సినిమాల సక్సెస్‌లు మావి కాదు. టెక్నీషియన్స్, ఆర్టిస్ట్‌లవి. వారందరికీ థ్యాంక్స్. 1987 డిసెంబర్లో నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చాయి. ‘పెళ్లి పందిరి’ మా లైఫ్‌లో లేకుంటే ఈ ఆరు సినిమాలు లేవు. ఐదు వేలరూపాయల గురించి మేం వెతుక్కున్న రోజులున్నాయి. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న మేం ప్రొడక్షన్లోకి రావాలనే ఆలోచనతో వినాయక్‌తో ‘దిల్’ సినిమా తీశాం. సుకుమార్, బోయపాటి శీను, భాస్కర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల, వేణు.. ఇలా ఎనిమిది మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఏడుమంది సక్సెస్‌లో ఉండటం హ్యాపీ. హ్యాట్రిక్ సినిమాలు చేయాలనుకునేవాణ్ణి. కానీ ఆరు సినిమాలు ఒకే ఏడాదిలో హిట్ అవుతాయని కలలో కూడా లేదు. అది దేవుడు రాసిపెట్టి ఉన్నారు’’ అన్నారు. ‘‘ఒకే భాషలో ఆరు సినిమాలు చేసి వరుసగా హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఘనత వెంకటేశ్వర బ్యానర్‌కి మాత్రమే దక్కింది. ఇందుకు రాజుగారు, శిరీష్, లక్ష్మణ్గార్లకి అభినందనలు’’ అన్నారు హీరో అల్లు అర్జున్. ‘‘తెలుగు సినిమాకి ది ఐకానిక్ ప్రొడ్యూసర్ రాజుగారు. ప్రొడక్షన్లోకి దిగాక తెలుస్తోంది అది ఎంత కష్టమో’’ అన్నారు హీరో నాని. ‘‘రాజుగారి సక్సెస్‌లో నేనూ పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. ‘‘ఈ ఏడాది ఎస్వీసీ బ్యానర్లో మొదటి హిట్ నా సినిమా అయినందుకు ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు సతీశ్ వేగేశ్న అన్నారు. ‘‘మూడేళ్ల కిందట యువరాజ్ ఆరు సిక్సర్లు కొట్టారు. ఈ ఏడాది రాజుగారు ఆరు హిట్స్ కొట్టారు. ఆయన యువరాజ్.. ఈయన ‘దిల్’ రాజు అన్నారు’’ హరీష్ శంకర్. ‘‘రాజుగారు వంద సినిమాలు తీయాలి’’ అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘‘ఎస్వీసీ బ్యానర్లో 27సినిమాలు తీస్తే అందులో 90శాతం సక్సెస్లుండటం గ్రేట్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఆర్యతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా జర్నీ ప్రారంభమైంది. రాజుగార్ని అప్పటి నుంచి చూస్తున్నా. ఆయన ఓ గోల్ పెట్టుకొని రీచ్ అవుతుంటారు’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ‘‘మూడేళ్ల తర్వాత నేను ఇక్కడున్నా’’ అన్నారు భూమిక. నటి జయసుధ, నటుడు జగపతిబాబు, ‘పెళ్లిపందిరి’ నిర్మాత రమేశ్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, సాయికార్తీక్, శక్తికాంత్, నటుడు నరేశ్, హీరో నవీన్ చంద్ర, హీరోయిన్స్ మెహరీన్, అనుపమా పరమేశ్వరన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నక్కిన త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి వల్లే గెలుపు
‘‘జవాన్’ టైటిల్ వినగానే మిలటరీ నేపథ్యంలో సినిమా ఉంటుందేమో అనుకుంటారు. ఈ సినిమాలో ఆర్మీని టచ్ చేయలేదు. సామాజిక బాధ్యత అనేది మెయిన్ పాయింట్’’ అని సాయిధరమ్‌తేజ్ అన్నారు. సాయిధరమ్, మెహరీన్ జంటగా బి.వి.ఎస్. రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ‘జవాన్’ ఈ రోజు విడుదలవుతోన్న సందర్భంగా తేజ్ పంచుకున్న విశేషాలు... ► ‘జవాన్’ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశా. ఇందులో నేను చేసిన జై పాత్ర నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది. హుద్‌హుద్ తుపాను, చెన్నైలో వరదలు, నిజాంపేటలో వర్షపు నీరొచ్చినప్పుడు సామాజిక బాధ్యతగా ఎలా స్పందించానో సినిమాలో నా పాత్ర అలానే ఉంటుంది. ► ప్రతి ఒక్కరూ మన ఇంట్లోని సమస్యలను ఎదుర్కోడానికి జవాన్లాగా నిలబడతాం. దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశాం. జవాన్ అంటే అందరూ ఆర్మీ అనుకుంటారు. కానీ, సమస్యల్ని ఎదుర్కొనే మనమందరమూ జవాన్లమే అని రవిగారు చక్కగా చెప్పారు. ► సినిమా బాగా రాకపోవడంతో రీషూట్స్ జరిగాయనీ.. నిర్మాతలు హ్యాపీగా లేరనీ.. కొరటాల శివగారు స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యారన్నది అవాస్తవం. రవిగారు–కొరటాలగారు బెస్ట్ ఫ్రెండ్స్. వారి మధ్య మా సినిమా డిస్కషన్స్ వచ్చినప్పుడు కొరటాలగారు సలహా ఇచ్చారంతే. ► ఈ ఏడాది మార్చి 31న షూటింగ్ ప్రారంభించాం. సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకున్నాం. కానీ, ప్రతివారం వరుసగా సినిమాలు విడుదల ఉండటంతో ప్రేక్షకులు నా సినిమానే ఎందుకు చూడాలి? అనుకున్నా. నిర్మాతలకు డబ్బులు రావాలి. నాకు హిట్ కావాలి. మా చిత్రం ప్రేక్షకులకు బాగా చేరువ కావాలనే ఉద్దేశంతో షూటింగ్ మెల్లగా చేశాం. అందుకే రిలీజ్ లేట్ అయింది. ► హిట్టు, ఫ్లాప్‌లను ఎలా తీసుకుంటారనే ప్రశ్నకు బదులిస్తూ... రెండింటి గురించి పెద్దగా పట్టించుకోను. మన పని కరెక్ట్‌గా చేశామా? లేదా? అని ఆలోచిస్తా. సినిమా ఫ్లాప్ అయితే.. ఎక్కడ తప్పు జరిగింది? తెలుసుకుని తర్వాత సినిమాకి జాగ్రత్త పడతా. సక్సెస్, ఫెయిల్యూర్లను వేర్వేరుగా చూడను. అయినా ఓటమి వల్లే గెలుపు వస్తుంది. ► జనరల్‌గా నేను నవ్వుతూ ఉంటాను. కానీ, ఈ సినిమాలో నవ్వకూడదు. చాలా మెచ్యూర్డ్‌గా మసులుకోవాలి. అందుకు నేను మెంటల్‌గా ప్రిపేర్ అయ్యా. నా నుంచి ఇంత మంచి నటన రాబట్టుకున్న క్రెడిట్ మొత్తం రవిగారిదే. ► ‘విన్నర్’ సినిమా తర్వాత నేను అమ్మాయిల వెంటపడి టీజ్ చేసే సన్నివేశాలు, పాటలు చేయనని చెప్పేశా. ఈ సినిమాలో మెహరీన్‌ది నన్ను డామినేట్ చేసే పాత్ర. చాలా బాగా చేసింది. తమన్ చాలా మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. రాశీఖన్నాతో పాట పాడించాలనే ఐడియా తమన్‌దే. ► వినాయక్‌గారితో చేస్తోన్న సినిమా 60 శాతం పూర్తయింది. ఫిబ్రవరిలో రీలీజ్ అనుకుంటున్నాం. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తా. మరికొన్ని కథలు వింటున్నా. -
ఈ సినిమా కోసం క్లాసులకి వెళ్లా!
‘‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ విడుదలైన రెండో రోజే ‘జవాన్’కి సంతకం చేశా. అప్పటికి నాకసలు ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తెలీదు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే... ఇప్పటికీ నాకు ఈ కథ పూర్తిగా తెలీదు. రవిగారు నాపైన పెట్టుకున్న నమ్మకంతోనే ఈ చిత్రం ఒప్పుకున్నా. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. కచ్చితంగా హిట్ అవుతుంది’’ అని మెహరీన్ అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో నా పాత్ర పేర భార్గవి. పెయింటర్ని. వెరీ బబ్లీ గాళ్. నా గత సినిమాల్లో కంటే ఇందులో కొంచెం ఎక్కువ గ్లామరస్‌గా కనిపిస్తా. సాయిధరమ్ తేజ్ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఈ సినిమాతో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తను మంచి డ్యాన్సర్. నాకు పెద్దగా డ్యాన్స్ రాదు. అందుకని, ఈ సినిమా కోసం డ్యాన్స్ క్లాసులకి వెళ్లా. ప్రాక్టీస్ కోసం ఇక్కడ సినిమాలు చేసి, తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోవాలనుకోవడం లేదు. నా దృష్టిలో టాలీవుడ్, బాలీవుడ్ వేర్వేరు కాదు. తెలుగు సినిమా నాకు ఎప్పటికీ ఎక్కువే. ఇప్పుడు తెలుగు సినిమానే టాప్‌లో ఉంది. ప్రస్తుతానికి గోపీచంద్ 25వ సినిమా ఒక్కటే కమిట్ అయ్యా’’ అన్నారు. -
ఆడితే నా చుట్టూ పదిమంది... లేదంటే పదిమంది చుట్టూ నేను!
‘‘ఇప్పటివరకూ 70 సినిమాలకు పైగా రచయితగా పనిచేశా. ‘వాంటెడ్’తో దర్శకుడిగా మారా. ఆ సినిమాను అనుకున్నట్టుగా తీయలేకపోయా. ‘జవాన్’ విషయంలో నా తప్పుల్ని రిపీట్ కానివ్వలేదు. ఈసారి నాలోని రచయిత కన్నా దర్శకుడే ఎక్కువ డామినేట్ చేశాడు. సినిమా తప్పకుండా హిట్టవుతుందని చెప్పగలను’’ అని బీవీయస్ రవి అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ఆయన దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన సిన్మా ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పకులు. వచ్చే నెల 1న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘ప్రతి వ్యక్తికీ ఓ లక్ష్యం ఉంటుంది. అందరి ఉమ్మడి లక్ష్యం దేశం కావాలి. దేశం కోసం నీది, నాది అనే భావలను పక్కన పెట్టి అందరం ఒక్కటై మనం అనే భావనతో ముందుకు సాగాలి’ అనే థీమ్‌తో, సందేశంతో సినిమా తీశా. కథంతా డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) నేపథ్యంలో జరుగుతుంది. పోస్టర్లు, ట్రైలర్లలో కథేంటో చెప్పేశా. కథ రాశాక (సాయిధరమ్) తేజ్‌నే హీరోగా అనుకున్నా. సినిమాలో తేజ్ ఆర్ఎస్ఎస్ జవాన్‌గా కనిపిస్తాడు. ‘కష్టం తనదాకా వస్తే కదిలేవాడు మనిషి కాడు, కష్టం ఎక్కడుందో తెలుసుకుని వెళ్లేవాడు మనిషి’– అనేది తేజ్ క్యారెక్టరైజేషన్. తను చేసిన గత సినిమాల్లో పాత్రలకంటే విభిన్నమైన పాత్ర. యాక్టింగ్ పరంగా, లుక్స్ పరంగా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. తేజ్ కెరీర్లో ‘జవాన్’ ఓ కీలక మలుపుగా నిలుస్తుందనే నమ్మకముంది. ఈ సినిమా నా కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్. ఇది ఆడితే పదిమంది నాకు డబ్బులిచ్చి సినిమాలు తీయమంటారు. లేదంటే పది మంది చుట్టూ నేను తిరుగుతా. ఒక్కటి మాత్రం చెప్పగలను... భవిష్యత్తులోనూ విలువలతో కూడిన సినిమాలు తీయాలనుకుంటున్నా’’ అన్నారు. -
బంగారు... ఓ మంచి పెప్పీ సాంగ్
‘దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’ అనే థీమ్‌తో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి దర్శకుడు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీవీఎస్ రవి మాట్లాడుతూ– ‘‘దేశానికి రక్షణగా జవానులు ఉంటారు. అలాగే, ప్రతి ఇంటికీ జవాన్ ఉండాలి, ఉంటాడు కూడా! దేశంలోని తన ఇంటినీ, ఇంట్లోవారినీ తన గుండెల్లో పెట్టుకుని బాధ్యతతో మా జవాన్ కాపాడుకుంటాడు. అందుకే, ‘కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది’ అని టీజర్లో చెప్పాం. అలాగే, ‘దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’ డైలాగ్. ఇవి విన్నవాళ్లు ఫోనులు చేసి ‘మనసు పెట్టి రాశావ్’ అని ప్రశంసించారు. నిజంగానే ఈ డైలాగులు, కథను మనసుపెట్టి రాశాను. మనసుపెట్టి సినిమాను తీశాను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్’’ అన్నారు. డిసెంబర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రసమర్పకుడు ‘దిల్’ రాజు, నిర్మాత కృష్ణ తెలిపారు. ‘జవాన్’లో రాశీ ఖన్నా బంగారు: హీరోయిన్గా వరుస హిట్స్‌లో ఉన్న రాశీ ఖన్నా... సింగర్‌గానూ జోరు చూపిస్తున్నారు. ‘జోరు’తో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. రీసెంట్గా రెండు సినిమాల్లో పాటలు పాడారు. అయితే... రెండిటిలోనూ హీరోయిన్ ఆమె కాదు. నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’లో ఓ పాట పాడారు. శుక్రవారం ఆ ఆడియో విడుదలైంది. సాయిధరమ్ తేజ్ ‘జవాన్’లో పాడిన పాట త్వరలో విడుదల కానుంది. ‘‘జవాన్’లో మంచి పెప్పీ సాంగ్ పాడడం ఆనందంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బీవీఎస్ రవిలకు థ్యాంక్స్’’ అని రాశి ట్వీట్ చేశారు. ‘‘వాట్ ఎ టాలెంట్. ‘బంగారు...’ పాటకు రాశి వాయిస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ పాట విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్నా’’ అని రాశికి తమన్ రిప్లై ఇచ్చారు. -
ఏ స్థాయి హిట్టో...
ఈరోజు తెలుస్తుంది‘‘చిన్నప్పుడు అమ్మ, నాన్న, బంధువులు మన కేరాఫ్. పెద్దయ్యాక కేరాఫ్ అంటే ఫ్రెండ్. స్నేహం కోణంలో నడిచే ఎమోషనల్ డ్రామా ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రంలో నా పేరు సూర్య. నేను ఎవరెవరికి కేరాఫ్ అన్నదే కథ’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, మెహరీన్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. శంకర్ చిగురుపాటి సమర్పణలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమా రెండు భాషల్లోనూ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పత్రికలవారితో సందీప్ కిషన్ పంచుకున్న విశేషాలు. ► ఈ చిత్రంలో నా పాత్ర పక్కింటి అబ్బాయిలా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన పాత్ర చేశా. ‘నా పేరు శివ’ సినిమాలో కార్తీ పాత్రకు కొనసాగింపులా ఇందులో నా పాత్ర ఉన్నట్లు ఉంటుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లందరికీ మా సినిమా కూడా తప్పక నచ్చుతుంది. ► సుశీంద్రన్ చేసిన మొదటి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. నేను వర్క్ చేసిన బెస్ట్ డైరెక్టర్స్‌లో ఆయన ఒకరు. కథ, పెర్ఫార్మెన్స్ మీద ఆయన ఎక్కువ వర్క్ చేస్తారు. టెక్నికల్ అంశాల మీద పెద్దగా దృష్టి సారించరు. అవి కథతో పాటే వెళ్లిపోతుంటాయి. ఇదొక నిజాయతీ కలిగిన సినిమా. అందుకే సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ► ఈ చిత్రం తెలుగు, తమిళంలో వేర్వేరుగా తీస్తే 14 కోట్లు బడ్జెట్ అయ్యేది. రెండు భాషల్లో కలిపి చేయడంతో రూ. 10 కోట్లు అయింది. రెండు భాషల్లోనూ సినిమాను డీల్ చేయగల దర్శకుడితో పని చేయాలనుకుని చేశా. తెలుగు, తమిళానికి ఫస్టాఫ్‌లో పూర్తిగా తేడా ఉంటుంది. సెకండాఫ్ రెండు భాషల్లోనూ ఒకలానే ఉంటుంది. ► తమిళంలో ప్రివ్యూ వేశాం. చూసినవాళ్లంతా కచ్చితంగా సినిమా హిట్టవుతుందంటున్నారు. ఆ హిట్ ఏ స్థాయిలో ఉంటుందో ఈరోజు సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది. మెహరీన్ పాత్ర కొద్దిగా రౌడీలా బిహేవ్ చేస్తుంది. ఆమె కనిపించిన ప్రతిసారీ నవ్వుకుంటారు. ► ఎప్పటి నుంచో కృష్ణ్ణవంశీగారితో వర్క్ చేయాలనే కోరిక ‘నక్షత్రం’తో తీరింది. ఆ సినిమాతో నాకు మంచి నటుడు అనే పేరు వచ్చింది. కానీ, ఆ చిత్రం కోసం కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను. ► మంజులగారితో ఒక సినిమా, కునాల్ కోహ్లీతో ఒక తెలుగు స్ట్రయిట్ సినిమా , తమిళంలో కార్తీక్ నరేన్‌తో ‘నరగసూరన్’ అనే సినిమాలు చేస్తున్నా. అలాగే కార్తీక్ ఘట్టమనేనితో ఓ సినిమా ఉంది. -
డబ్బింగ్ సినిమా అంటుంటే బాధగా ఉంది – సందీప్ కిషన్
‘‘దర్శకుడు సుశీంద్రన్ సినిమాలకు నేను ఫ్యాన్. ఆయన మంచి దర్శకుడే కాదు.. మంచి వ్యక్తి కూడా. ఇలాంటి వ్యక్తితో సినిమా చేయడం నా లక్’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, మెహరీన్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. శంకర్ చిగురుపాటి సమర్పణలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ప్రీ–రిలీజ్ వేడుకలో సందీప్ మాట్లాడుతూ– ‘‘తమిళ హీరోలు వారి సినిమాలను తెలుగులో డబ్ చేసి, మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. మన తెలుగు హీరోలు ఇప్పుడలాంటి ప్రయత్నం చేస్తుంటే, చాలా మంది నెగిటివిటీతో మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మా సినిమాని 59 రోజుల్లోనే పూర్తి చేశాం. కష్టపడి చేసిన సినిమాను డబ్బింగ్ సినిమా అంటుంటే బాధగా ఉంది. మాపై నమ్మకంతో థియేటర్‌కు రండి.. సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా ‘కేరాఫ్ సూర్య’. తమిళంలో నాకు నచ్చిన హీరో ధనుష్. ఈ సినిమాలో సందీప్ కూడా ధనుష్ లాంటి పెర్ఫార్మెన్స్ చేశాడు’’ అన్నారు సుశీంద్రన్. ‘‘సుశీంద్రన్ వంటి డైరెక్టర్ సందీప్‌తో తెలుగు, తమిళంలో సినిమా చేయడం గొప్ప విషయం’’ అన్నారు ఛోటా కె. నాయుడు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రాజేశ్. -
హీరోలు ముందుకొస్తేనే కొత్త కథలొస్తాయి– ‘దిల్’ రాజు
‘‘రవితో (రవితేజ) నాకు 20ఏళ్ల పరిచయం. ‘ఆర్య’ కథని ఫస్ట్ తనకే చెప్పాం. కథ బాగుంది. కానీ, నాకు కరెక్ట్ కాదన్నాడు. నితిన్, ప్రభాస్ తర్వాత బన్ని (అల్లు అర్జున్) వద్దకు వెళ్లింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే కొన్ని కథలు వాటికవే ప్రయాణం చేస్తూ వాళ్లతోనే చేయిస్తాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘రాజా ది గ్రేట్’ ఈ నెల 18న రిలీజవుతోంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్ నాకు ‘రాజా ది గ్రేట్’ ఐడియా చెప్పినప్పుడు ఎగై్జటయ్యా. సినిమా మొత్తం హీరో అంధుడు అన్నప్పుడు తెలుగులో ఇలాంటి సినిమా వర్కట్ అవుద్దా? అని చాలామంది డౌట్లు అడిగారు. ఈ కథ చాలామంది హీరోల వద్దకు వెళ్లింది. రవికి రాసిపెట్టి ఉండటంతోనే ఆయన వద్దకు వెళ్లింది. సినిమా చూశాక రవికి ఫోన్ చేసి ‘ఇరగ్గొట్టేశావ్’ అన్నా. ‘నీ మాటలో ఏంటి? ఇంత కాన్ఫిడెన్స్’ అన్నారు. ‘శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా’ వరుస సక్సెస్‌లు. బాల్ పడుతుంటే బ్యాట్స్‌మెన్‌కి టెన్షన్ ఉన్నట్టే నాకూ ఈ సినిమాతో మొన్నటి వరకూ టెన్షన్ ఉండేది. సినిమా చూశాక ‘థ్యాంక్యూ అనిల్... ఫిఫ్త్ బాల్ కూడా సిక్సర్ కొట్టేశాం’ అన్నా. రవితేజ కెరీర్లో ‘ఇడియట్’ వన్నాఫ్ ద బెస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత ‘భద్ర’, ‘విక్రమార్కుడు’... ఇప్పుడు మళ్లీ ‘రాజా ది గ్రేట్’. మమ్మల్ని నమ్మి అంధుడి పాత్ర చేసినందుకు రవికి హ్యాట్సాఫ్. కమర్షియల్ సినిమా కొత్తగా రావాలంటే అది హీరోతోనే సాధ్యం. హీరో ముందుకొస్తే కొత్త కథలు, పాత్రలొస్తాయి’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే నా డైరెక్టర్లే కారణం. మనకి నిర్మాతలు చాలామంది ఉంటారు. మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో రాజు ఒకరు. తనకున్న జడ్జిమెంట్ కానీ, టేస్ట్ కానీ, ఆ సక్సెస్ రేట్ చూస్తే తెలుస్తుంది. ప్రతి సినిమాకి రేయింబవళ్లు కష్టపడతాడు తను. శిరీష్ నాలానే. అనిల్ మంచి ఎనర్జిటిక్, పాజిటివ్ పర్సన్. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సుప్రీమ్’ తర్వాత రాజుగారితో బ్లైండ్ కాన్సెప్ట్ చెప్పగానే చేద్దామన్నారు. రవితేజగారు ఎంటరయ్యాక ఆయన ఎనర్జీ లెవల్స్‌కి తగ్గట్టు కథ రాశా. కథ మొత్తం అమ్మాయి చుట్టూ తిరిగినా... మార్నింగ్ షో చూశాక అందరూ ‘రవితేజ ది గ్రేట్’ అంటారు. ఆయన నటన చూశాక నాకు మాటలు రాలేదు. నిర్మాతలు నాకు ఫ్రీడమ్ ఇవ్వబట్టే ఇంతమంచి సినిమా వచ్చింది’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘వెరైటీ పాత్రలు చేయాలనుకునే వారే నటులు. నాకు తెలిసి ఒక కమర్షియల్ హీరో... మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇంత అద్భుతమైన పాత్ర చేయడం తొలిసారి. ఈ సినిమా తర్వాత ‘రవితేజ గొప్ప నటుడు’ అంటారు. ‘సర్వేంద్రియానాం సర్వమ్ ప్రదానం’ అని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది’’ అన్నారు. -
ఈ దీపావళి ఫుల్ స్పెషల్!!
‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాలో ‘‘నేను చెప్పానా! నీకు చెప్పానా!! నీకు చెప్పానా!!!’’ అంటూ ఓ డైలాగ్ ఉంది. గుర్తొచ్చింది కదూ!? ఆ మహాలక్ష్మిని మనమెలా మరచిపోతాం!? ఇప్పుడు ఆ మహాలక్ష్మి.. అదే మన మెహ్రీన్.. టాలీవుడ్ సెన్సేషన్. దసరాకు ‘మహానుభావుడు’తో వచ్చి హిట్ కొట్టేసింది. దీపావళికి ‘రాజా ది గ్రేట్’ అంటూ వచ్చేస్తోంది. ఆ వెంటనే ‘జవాన్’. ఇలా తెలుగులో ఫుల్ బిజీ అయిపోయిన మెహ్రీన్ చెప్పిన దీపావళి ముచ్చట్లివి.. ఫెస్టివల్ టు ఫెస్టివల్.. పండగంతా మీ సినిమాలతోనే నిండిపోయినట్టుందీ? (నవ్వుతూ..) బ్లెస్స్డ్. దసరాకి వచ్చిన ‘మహానుభావుడు’ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. రేపు దీపావళికి ‘రాజా ది గ్రేట్’ వచ్చేస్తోంది. ఈ ఫెస్టివల్ టైమ్ నిజంగా స్పెషల్! ఈ దీపావళి స్పెషల్ ఏంటి? ఈ దీపావళే స్పెషల్! దీపావళంటే ఇంట్లో అందరం ఒక్కచోట చేరిపోతాం. నిజంగా పండుగ అనే దానికి అర్థమిచ్చేలా ఉంటుంది అందర్నీ కలవడం. ఈ సారైతే ‘రాజా ది గ్రేట్’ విడుదలవుతోంది. సో అదింకా స్పెషల్. హ్యాట్రిక్ కొడతానన్న నమ్మకం ఉంది. చిన్నప్పుడు దీపావళి ఎలా సెలిబ్రేట్ చేసుకునేవారు? చిన్నప్పుడు దీపావళికి క్రాకర్స్ కాల్చడం పెద్ద సరదా. ఇల్లంతా పిల్లలే ఉండేవాళ్లం కదా, ఎంత సేపు కాల్చినా సరిపడేన్ని క్రాకర్స్ కొనిపెట్టేది అమ్మ. పొద్దునంతా పూజ చేస్తూంటే, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా.. ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాలుస్తానా అని ఎగై్జట్ అయిపోయేదాన్ని. ఇప్పుడు క్రాకర్స్‌కి పూర్తిగా దూరం. పెద్దదాన్ని అయిపోయా కదా.. (గట్టిగా నవ్వుతూ!) దీపావళి అనగానే మీకేం గుర్తొస్తుంది? మా ప్రాంతంలో (పంజాబ్) దీపావళి పెద్ద పండుగ. అందరం కలవడమే పెద్ద సెలిబ్రేషన్. అదీకాక నా బర్త్‌డే (నవంబర్ 5) కూడా దీపావళి టైమ్‌లోనే వస్తుంది కాబట్టి ఈ టైమ్ కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటా. ఇప్పుడు నాకు స్మోక్ అన్నా, ఆ సౌండ్ అన్నా చచ్చేంత భయం. చిన్నప్పుడు అంతలా ఎలా క్రాకర్స్ కాల్చేదాన్నా అనిపిస్తూ ఉంటుంది! దీపావళికే వస్తోన్న మీ సినిమా ఎలా ఉండబోతోంది? ‘రాజా ది గ్రేట్’ దీపావళికే రావాల్సిన సినిమా. ఇందులో రవితేజ గారు బ్లైండ్ పర్సన్‌గా కనిపిస్తారు. కళ్లు కనిపించని వారికి ఒక ట్రిబ్యూట్‌లా ఉంటుంది. దీపావళి అంటే వెలుగుల పండుగ. కానీ కళ్లు లేని వాళ్లకు దీపావళి కూడా చీకటే! అయితే వారి మనసు, మంచి ఆలోచనే గొప్ప వెలుగు అని చెప్పేలా సినిమా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా దీపావళికి రావడమే పర్ఫెక్ట్. తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? పండుగకు ప్రేక్షకులకు ఇచ్చే మెసేజ్? తెలుగు ఇండస్ట్రీ సూపర్బ్. మహాలక్ష్మి అంటూ ఇప్పటికీ నాపై అదే ప్రేమ చూపిస్తున్నారు. ఐ లవ్ పీపుల్ హియర్. నేనిచ్చే మెసేజ్ అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. ఒకరి లైఫ్‌లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తే మన లైఫ్ కూడా అందంగా ఉంటుంది. అదే దీపావళి. -
కష్టాలు..సంతోషాలు..!
సందీప్‌కిషన్ హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. మెహరీన్ కథానాయిక. చక్రి చిగురుపాటి నిర్మాత. డి.ఇమాన్ స్వరకర్త. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదుల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజజీవిత సంఘటనలకు దగ్గరగా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ తీయడం సుశీంద్రన్ ప్రత్యేకత. ఆయన తీసిన ‘నా పేరు శివ’ చిత్రానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. వ్యక్తిగానూ ఆయన మంచి మనిషి. సుశీంద్రన్‌గారి సినిమాలో యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇందులో నేను మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్లో నటించాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ల కష్టాలు, సంతోషాలను ఈ సినిమాలో చూపించాం. కథను నమ్మి నిర్మాతలు సినిమా తీశారు. డి. ఇమాన్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి స్ట్రైట్మూవీ ఇది. ‘నా పేరు శివ’లో నటించిన ఐదుగురు గ్యాంగ్ ఈ సినిమాలో కూడా నటించారు. నిర్మాత బాగా సహకరించారు. సందీప్, మెహరీన్ బాగా నటించారు. సినిమా హిట్ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు సుశీంద్రన్. ‘‘సందీప్ కెరీర్లో ఈ చిత్రం హిట్ మూవీగా నిలుస్తుంది. మెహరీన్‌కు మంచి పేరు వస్తుంది. నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. హీరోయిన్ మెహరీన్‌తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొంది. -
7లో 5 హిట్లు చిన్న విషయం కాదు! – ‘దిల్’ రాజు
‘‘ఆర్య’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా స్టార్ట్ అయిన వంశీ ఇప్పుడు నాతో సమానంగా విజయవంతమైన సినిమాలు చేస్తున్నాడు. ఏడు సినిమాల్లో ఐదు సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం చిన్న విషయం కాదు. ఎంత హార్డ్‌వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందో నాకు తెలుసు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ సెప్టెంబర్ 29న విడుదలై మంచి హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పన్నెండు, పదమూడేళ్లుగా శర్వానంద్ తెలుసు. హీరో సినిమాను మెయిన్‌గా రన్ చేయాలి. శర్వా ఆ బాధ్యత నిలబెట్టుకుంటున్నాడు. ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో మారుతి కథలు రాసుకుంటుంటాడు. తన సక్సెస్ ఫార్ములా అదే’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నేను ఎంజాయ్ చేస్తూ జరుపుకున్న పుట్టినరోజు ఇది. ‘మహానుభావుడు’ సక్సెస్ రూపంలో ప్రేక్షకులు నాకు గిఫ్ట్ ఇచ్చారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ, ఎస్కేయన్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మహానుభావుడు’ చేసినందుకు ఓ నటుడిగా చాలా హ్యాపీగా, సంతృప్తిగా ఉన్నా. ఇంత మంచి సినిమా నాదని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు శర్వానంద్. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మేఘన రోల్ ఇచ్చినందుకు మారుతిగారికి థ్యాంక్స్’’ అన్నారు మెహరీన్. -
ఈ విజయంతో ఓ దారి వేయాలనుకుంటున్నాం – ‘దిల్’ రాజు
‘‘దిల్’ రాజుతో సినిమా చేసి 13 ఏళ్లైంది. కొంచెం లేటయినప్పటికీ... మంచి సినిమా చేశాం. విపరీతమైన క్లారిటీ ఉన్న దర్శకుడు అనిల్. మోస్ట్ పాజిటివ్ పర్సన్! అందర్నీ నవ్విస్తూ హుషారుగా వర్క్ చేస్తాడు. తను చేసినదాంట్లో నేను 50 శాతం చేస్తే... మంచి పేరొస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ సిన్మాతో అనిల్‌కి హ్యాట్రిక్ హిట్ వస్తుంది’’ అన్నారు రవితేజ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ‘రాజా ది గ్రేట్’ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘మాతో పాటు శిరీష్ ఈ సినిమాకి దగ్గరుండి వర్క్ చేశారు. అంతకుముందు ఆయనతో నాకంత ఇంట్రాక్షన్ లేదు. రాధిక, రాజేంద్రప్రసాద్, పోసానిగార్లతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్. వాళ్లతో పాటు శ్రీనివాసరెడ్డి బాగా నటించారు. మెహరీన్‌కి కూడా ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. ఎడిటర్ తమ్మిరాజు, డీఓపీ మోహన్‌కృష్ణ, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌లతో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. వాళ్లందరూ ఈ సిన్మాతో నెక్ట్స్ లెవల్‌కి వెళతారని అనుకుంటున్నా’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్ కథ చెప్పగానే, రవితేజ నాకు ఫోన్ చేసి... ‘దర్శకుడు నా ముందు చేసినట్టు నేను సినిమాలో చేస్తే చాలు’ అన్నారు. అన్నట్టుగానే అద్భుతంగా నటించాడు. రవితేజ నటనే సినిమా సక్సెస్‌కి ముఖ్య కారణమవుతుంది. వెంకటేశ్వరస్వామి దయ వల్ల హిట్స్‌లో ఉన్న మా సంస్థకి మరో హిట్ అందించేలా ఉన్నాడు అనిల్. దీపావళికి తమిళంలో, హిందీలో పెద్ద సినిమాలు విడుదలవుతాయి. తెలుగులో మాత్రం పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తారు. దాన్ని బ్రేక్ చేయాలి. మనకు సంక్రాంతి, ఉగాది, దసరా ఎలాగో... దీపావళి అలాగే కావాలని ప్రయత్నిస్తున్నాం. మా సినిమా విజయంతో తెలుగులో పెద్ద సినిమాల విడుదలకు ఓ దారి వేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మంచి పేరొచ్చే మంచి సినిమా చేస్తున్నామనే ఫీల్‌ను ‘రాజా... ది గ్రేట్’ స్టార్టింగ్ నుంచి ఎంజాయ్ చేస్తున్నా. రవితేజగారికి 20 నిమిషాలు కథ చెప్పిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంధుడైన తన కుమారుణ్ణి గుడ్డిగా నమ్మే అమ్మ పాత్రలో రాధికగారు నటించారు. సినిమాకి సెంటర్ పాయింట్ అదే. అంతే గుడ్డిగా రవితేజగారు నన్ను నమ్మారు. ఆయన నమ్మకమే నా బలం. ‘దిల్’ రాజుగారు హెడ్ మాస్ట్టర్లా పాజిటివ్ గైడెన్స్‌తో మమ్మల్ని ప్రొత్సహించారు. దీపావళికి థియేటర్లో బిట్ సాంగ్‌తో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘కళ్లుండి గుడ్డివాడిలా నటించడం చాలా కష్టం. కానీ, రవితేజగారు సూపర్‌గా నటించారు. పదిమంది సురేశ్‌బాబులు, పదిమంది ‘దిల్’ రాజులు ఉంటే తెలుగు చిత్రసీమ ఇండియాలో వన్నాఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ అవుతుంది’’ అన్నారు పోసాని. ‘‘ఓ అంధుడిపై ఇంత కమర్షియల్ సిన్మా రావడం గ్రేట్. నా లైఫ్‌లో మర్చిపోలేని సినిమాల్లో ఇదొకటి అవుతుందని గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నా’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మెహరీన్, నటుడు శ్రీనివాసరెడ్డి, స్వరకర్త సాయికార్తీక్, డీఓపీ మోహన్‌కృష్ణ పాల్గొన్నారు. -
శర్వాకీ ఇతర హీరోలకీ తేడా అదే!
ఆనంద్ (శర్వానంద్) సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. క్లీన్‌గా ఉండకపోతే అతనికి నచ్చదు. క్యాప్ లేని పెన్ను చూస్తే తనే వెళ్లి క్యాప్ పెడతాడు. పక్కవాళ్ల బైక్‌కు బురద అంటితే క్లీన్ చేస్తానంటాడు. అంతెందుకు గర్ల్‌ఫ్రెండ్‌కు కిస్ చేయాలనుకున్నా బ్రెష్ చేశావా? అని అడిగే టైప్. హ్యాండ్స్‌కు గ్లౌజ్ వేసుకుంటాడు. అతనెందుకిలా ప్రవర్తిస్తున్నాడంటే అతనికి ఓసీడీ. ఆనంద్కి మేఘన (మెహరీన్) అంటే ఇష్టం. మేఘనకు కూడా ఇష్టమే. హ్యాండ్‌వాష్ చేసుకుంటేగానీ ఏదీ ముట్టని మనోడు ఆ అమ్మాయి చేయిపట్టుకుని ఏడడుగులు ఎలా నడిచాడన్నదే మహానుభావుడైన ఆనంద్ కథ. ‘‘హీరో అంటేనే స్పెషల్. నిజ జీవితంలో మనకన్నా వాళ్లు ఎప్పుడూ స్పెషలే. హీరో క్యారెక్టర్‌కు ఓసీడీ (అతిశుభ్రత) అనగానే, ఇది మలయాళ సినిమాకు రీమేక్ అని ఎలా అంటారు? ‘మహానుభావుడు’ చూశాక నిర్ణయిస్తే బెటర్’’ అని దర్శకుడు మారుతి అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా ఆయన దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ నేడు విడుదలవుతోంది. మారుతి మాట్లాడుతూ– ‘‘మనుషుల అలవాట్లు, గుణాల మీద చాలా కథలు రాసుకోవచ్చు. అలాంటి కథల్లో ‘మహానుభావుడు’ ఒకటి. నాలుగేళ్ల క్రితం ఈ కథ అనుకున్నా. అఖిల్‌కి సరిపోతుందని నాగార్జునగారికి చెప్పాను. నాకు చాలా మంది ఓసీడీ లక్షణాలున్నవారు తెలుసు. కొందరు చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. మరికొందరు అతి శుభ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఆయా లక్షణాలను బట్టి వాళ్లను వర్గీకరించవచ్చు. మిగిలిన హీరోలు ఆ పాత్రలను తమ స్టైల్‌కి తగ్గట్టు మార్చుకుని చేస్తారు. శర్వానంద్ మాత్రం పాత్రలోకి పరకాయప్రవేశం చేసి, చేస్తారు. ఇతర హీరోలకీ శర్వాకి తేడా అదే. ‘బాబు బంగారం’ చిత్రంలో వెంకీ పాత్రను అనుకున్న రీతిలో స్క్రీన్ మీదకు తీసుకురాలేకపోయాను. మిగిలిన విషయాల్లో అందరూ హ్యాపీ’’ అన్నారు. -
శర్వా మా ఇంటి హీరో – ప్రభాస్
‘శర్వా (శర్వానంద్) మా ఇంటి హీరో. తన యాటిట్యూడ్ సూపర్‌గా ఉంటుంది. భవిష్యత్‌లో శర్వా సూపర్‌స్టార్ అవుతాడు’’ అన్నారు ప్రభాస్. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘మహానుభావుడు’. ఎస్కెఎన్ సహనిర్మాత. మెహరీన్ కథానాయిక. తమన్ స్వరకర్త. ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘రన్ రాజా రన్’కి హీరోగా ఎవరు బాగుంటారనుకుంటున్నప్పుడు ‘శర్వా యాటిట్యూడ్ సూపర్‌గా ఉంటుంది. తనని తీసుకుందాం’ అని వంశీ అన్నాడు. శర్వా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. అదే శర్వాతో అంటే, ‘ట్రై చేస్తా. చూడండి. నచ్చకపోతే చెప్పండి’ అన్నాడు. ఆ యాటిట్యూడ్ మాకు నచ్చింది. శర్వాకు మేమందరం ఫ్యాన్స్ అయిపోయాం. ఆల్రేడీ హీరోగా చేసి, ‘నచ్చితే చూడండి’ అన్నాడు. ఆ రోజు నుంచి నాకు శర్వా బ్రదర్ అయిపోయాడు. మారుతి నిజంగా డాక్టర్. ఒక మనిషిని నవ్వించడం అంత ఈజీ కాదు. ‘ప్రేమక«థా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలకన్నా ‘మహానుభావుడు’ ఇంకా పెద్ద రేంజ్ హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను మహానుభావుడిని అయితే రియల్ లైఫ్‌లో మహానుభావుడు ప్రభాస్ అన్న. తను ఇక్కడికి వచ్చాడని ఇలా అనడంలేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ప్రభాస్ అన్నకు ప్రేమ ఇవ్వడం తప్ప ఇంకేమీ తెలీదు. నా సినిమా ఎప్పుడు రిలీజైనా నాకన్నా ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్నే. నేను ‘రన్ రాజా రన్’ చేసినప్పుడు ‘హిట్ కొట్టాంరా.. ఎంజాయ్ చెయ్’ అన్నాడు. పక్క వ్యక్తి పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో ప్రభాస్ ఫస్ట్ ఉంటాడు. మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు తనకు థ్యాంక్స్. మంచి సినిమా ఇచ్చినందుకు మారుతీగారికి థ్యాంక్స్. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రభాస్ వచ్చి ఈ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాకు శర్వానంద్ ప్రాణం పోశారు. శర్వా విశ్వరూపాన్ని థియేటర్లలో చూస్తారు. కొత్త శర్వాన్ని చూడబోతున్నారు. ‘భలే భలే మగాడివోయ్’లో నానీ యాక్షన్‌కి ఎంత ఎగై్జట్ అయ్యానో అంతకు డబుల్ ఎగై్జట్‌మెంట్ శర్వా నాకు ఇచ్చారు. నేను రాసుకున్న కథకు అందరూ ప్రాణం పోశారు. ఇలాంటి కాన్సెప్ట్స్ అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎమోషనల్ మూవీ. మంచి సినిమా తీయాడానికి కారణమైన యూవీ క్రియేషన్స్ వారికి రుణపడి ఉంటాను. ప్రభాస్‌గారు వచ్చినందుకు థ్యాంక్స్. ఆయనతో ఎప్పటికైనా సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘నేను ప్రభాస్ ఫ్యాన్‌ని. ఆయన లాంచ్ చేసిన నా లాస్ట్ ఆడియో ‘బృందావనం’. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఎంకరేజ్ చేస్తున్నారు. మారుతి వన్నాఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్. నా దగ్గర్నుంచి బాగా వర్క్స్ తీసుకున్నాడు. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమలో జవాన్
చేతిలో సెల్‌ఫోన్.. ఆ ఫోనులో ఫ్యామిలీ ఫొటో.. అది చూస్తూ ఎమోషన్ అయ్యే హీరో స్టిల్ చూసి, ‘ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అన్నారు కొందరు! హాకీ స్టిక్ పట్టుకుని కాలేజ్ గేట్ దగ్గర బైక్ మీద స్టైలిష్‌గా నిల్చున్న హీరోని చూసి, ‘ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్’ అని మరికొందరు అన్నారు. అయితే అదీ ఇదీ కాదు.. టోటల్‌గా ఇది పక్కా ఫ్యామిలీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ‘జవాన్’ చిత్రబృందం అంటోంది. అలాగని లవ్‌స్టోరీ లేదనుకు నేరు. ఇందులో మంచి లవ్‌స్టోరీ ఉంది. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో కృష్ణ నిర్మిస్తున్న ‘జవాన్’ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. నిర్మాత కృష్ణ మాట్లాడుతూ– ‘‘మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. జూలైలో సాంగ్స్ షూటింగ్, ఆగస్టులో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తాం. మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు. ‘‘సాయిధరమ్ ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యి, మరీ చేస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా బాగా వచ్చింది’’ అన్నారు చిత్ర సమర్పకుడు ‘దిల్’ రాజు. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘జవాన్’ కథ ఏంటి?, మాస్ కమర్షియల్ హీరోగా సాయిధరమ్‌ని ఎలా చూపించబోతున్నారు? అంటూ అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అడుగు తున్నారు. మంచి కథాంశంతో తెరకెక్కుతోంది. సాయి ఇప్పటివరకూ చెయ్యని ఓ మంచి పాత్ర చేస్తున్నాడని మాత్రం చెప్పగలను’’ అన్నారు. ప్రసన్న, జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: తమన్.