
ఉప్పమ్మ ఉప్పు!
ఉప్పమ్మ ఉప్పు... చిన్నప్పుడు నాన్న భుజాల మీదో తాత భుజాల మీదో, స్నేహితులతోనో ఆడుకున్న ఆట గుర్తుండే ఉంటుంది. ఇక్కడ ఈ ఫొటోను గమనిస్తే... రవితేజ, మెహరీన్ ఆ ఆటే ఆడుకుంటున్నట్లుంది కదూ. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం డార్జిలింగ్‌లో కీలక సన్నివేశాలు తీశారు.
అక్కడే రవితేజ, మెహరీన్ ఈ ఆట ఆడుకున్నారు. అఫ్‌కోర్స్ ఇది సినిమాలో సీన్ అనుకోండి. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్నారు. మరి.. కళ్లు కనిపించని ఈ హీరోగారు హీరోయిన్‌ని భుజాల మీద ఎక్కించుకుని మరీ ఎక్కడికి తీసుకెళుతున్నట్లు? సినిమాలో చూద్దాం. అన్నట్లు.. ఈ చిత్రబృందం డార్జిలింగ్‌కి గుడ్ బై చెప్పేసింది. త్వరలో హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.