‘‘జవాన్’ టైటిల్ వినగానే మిలటరీ నేపథ్యంలో సినిమా ఉంటుందేమో అనుకుంటారు. ఈ సినిమాలో ఆర్మీని టచ్ చేయలేదు. సామాజిక బాధ్యత అనేది మెయిన్ పాయింట్’’ అని సాయిధరమ్‌తేజ్ అన్నారు.
సాయిధరమ్, మెహరీన్ జంటగా బి.వి.ఎస్. రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ‘జవాన్’ ఈ రోజు విడుదలవుతోన్న సందర్భంగా తేజ్ పంచుకున్న విశేషాలు...
► ‘జవాన్’ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశా. ఇందులో నేను చేసిన జై పాత్ర నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది. హుద్‌హుద్ తుపాను, చెన్నైలో వరదలు, నిజాంపేటలో వర్షపు నీరొచ్చినప్పుడు సామాజిక బాధ్యతగా ఎలా స్పందించానో సినిమాలో నా పాత్ర అలానే ఉంటుంది.
► ప్రతి ఒక్కరూ మన ఇంట్లోని సమస్యలను ఎదుర్కోడానికి జవాన్‌లాగా నిలబడతాం. దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశాం. జవాన్ అంటే అందరూ ఆర్మీ అనుకుంటారు. కానీ, సమస్యల్ని ఎదుర్కొనే మనమందరమూ జవాన్‌లమే అని రవిగారు చక్కగా చెప్పారు.
► సినిమా బాగా రాకపోవడంతో రీషూట్స్ జరిగాయనీ.. నిర్మాతలు హ్యాపీగా లేరనీ.. కొరటాల శివగారు స్క్రిప్ట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యారన్నది అవాస్తవం. రవిగారు–కొరటాలగారు బెస్ట్ ఫ్రెండ్స్. వారి మధ్య మా సినిమా డిస్కషన్స్ వచ్చినప్పుడు కొరటాలగారు సలహా ఇచ్చారంతే.
► ఈ ఏడాది మార్చి 31న షూటింగ్ ప్రారంభించాం. సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకున్నాం. కానీ, ప్రతివారం వరుసగా సినిమాలు విడుదల ఉండటంతో ప్రేక్షకులు నా సినిమానే ఎందుకు చూడాలి? అనుకున్నా. నిర్మాతలకు డబ్బులు రావాలి. నాకు హిట్ కావాలి. మా చిత్రం ప్రేక్షకులకు బాగా చేరువ కావాలనే ఉద్దేశంతో షూటింగ్ మెల్లగా చేశాం. అందుకే రిలీజ్ లేట్ అయింది.
► హిట్టు, ఫ్లాప్‌లను ఎలా తీసుకుంటారనే ప్రశ్నకు బదులిస్తూ... రెండింటి గురించి పెద్దగా పట్టించుకోను. మన పని కరెక్ట్‌గా చేశామా? లేదా? అని ఆలోచిస్తా. సినిమా ఫ్లాప్ అయితే.. ఎక్కడ తప్పు జరిగింది? తెలుసుకుని తర్వాత సినిమాకి జాగ్రత్త పడతా. సక్సెస్, ఫెయిల్యూర్‌లను వేర్వేరుగా చూడను. అయినా ఓటమి వల్లే గెలుపు వస్తుంది.
► జనరల్‌గా నేను నవ్వుతూ ఉంటాను. కానీ, ఈ సినిమాలో నవ్వకూడదు. చాలా మెచ్యూర్డ్‌గా మసులుకోవాలి. అందుకు నేను మెంటల్‌గా ప్రిపేర్ అయ్యా. నా నుంచి ఇంత మంచి నటన రాబట్టుకున్న క్రెడిట్ మొత్తం రవిగారిదే.
► ‘విన్నర్’ సినిమా తర్వాత నేను అమ్మాయిల వెంటపడి టీజ్ చేసే సన్నివేశాలు, పాటలు చేయనని చెప్పేశా. ఈ సినిమాలో మెహరీన్‌ది నన్ను డామినేట్ చేసే పాత్ర. చాలా బాగా చేసింది. తమన్ చాలా మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. రాశీఖన్నాతో పాట పాడించాలనే ఐడియా తమన్‌దే.
► వినాయక్‌గారితో చేస్తోన్న సినిమా 60 శాతం పూర్తయింది. ఫిబ్రవరిలో రీలీజ్ అనుకుంటున్నాం. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తా. మరికొన్ని కథలు వింటున్నా.
ఓటమి వల్లే గెలుపు
Published Fri, Dec 1 2017 12:24 AM | Last Updated on Fri, Dec 1 2017 3:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment