‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాలో ‘‘నేను చెప్పానా! నీకు చెప్పానా!! నీకు చెప్పానా!!!’’ అంటూ ఓ డైలాగ్ ఉంది. గుర్తొచ్చింది కదూ!? ఆ మహాలక్ష్మిని మనమెలా మరచిపోతాం!? ఇప్పుడు ఆ మహాలక్ష్మి.. అదే మన మెహ్రీన్.. టాలీవుడ్ సెన్సేషన్. దసరాకు ‘మహానుభావుడు’తో వచ్చి హిట్ కొట్టేసింది. దీపావళికి ‘రాజా ది గ్రేట్’ అంటూ వచ్చేస్తోంది. ఆ వెంటనే ‘జవాన్’. ఇలా తెలుగులో ఫుల్ బిజీ అయిపోయిన మెహ్రీన్ చెప్పిన దీపావళి ముచ్చట్లివి..
ఫెస్టివల్ టు ఫెస్టివల్.. పండగంతా మీ సినిమాలతోనే నిండిపోయినట్టుందీ?
(నవ్వుతూ..) బ్లెస్స్‌డ్. దసరాకి వచ్చిన ‘మహానుభావుడు’ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. రేపు దీపావళికి ‘రాజా ది గ్రేట్’ వచ్చేస్తోంది. ఈ ఫెస్టివల్ టైమ్ నిజంగా స్పెషల్!
ఈ దీపావళి స్పెషల్ ఏంటి?
ఈ దీపావళే స్పెషల్! దీపావళంటే ఇంట్లో అందరం ఒక్కచోట చేరిపోతాం. నిజంగా పండుగ అనే దానికి అర్థమిచ్చేలా ఉంటుంది అందర్నీ కలవడం. ఈ సారైతే ‘రాజా ది గ్రేట్’ విడుదలవుతోంది. సో అదింకా స్పెషల్. హ్యాట్రిక్ కొడతానన్న నమ్మకం ఉంది.
చిన్నప్పుడు దీపావళి ఎలా సెలిబ్రేట్ చేసుకునేవారు?
చిన్నప్పుడు దీపావళికి క్రాకర్స్ కాల్చడం పెద్ద సరదా. ఇల్లంతా పిల్లలే ఉండేవాళ్లం కదా, ఎంత సేపు కాల్చినా సరిపడేన్ని క్రాకర్స్ కొనిపెట్టేది అమ్మ. పొద్దునంతా పూజ చేస్తూంటే, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా.. ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాలుస్తానా అని ఎగై్జట్ అయిపోయేదాన్ని. ఇప్పుడు క్రాకర్స్‌కి పూర్తిగా దూరం. పెద్దదాన్ని అయిపోయా కదా.. (గట్టిగా నవ్వుతూ!)
దీపావళి అనగానే మీకేం గుర్తొస్తుంది?
మా ప్రాంతంలో (పంజాబ్) దీపావళి పెద్ద పండుగ. అందరం కలవడమే పెద్ద సెలిబ్రేషన్. అదీకాక నా బర్త్‌డే (నవంబర్ 5) కూడా దీపావళి టైమ్‌లోనే వస్తుంది కాబట్టి ఈ టైమ్ కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటా. ఇప్పుడు నాకు స్మోక్ అన్నా, ఆ సౌండ్ అన్నా చచ్చేంత భయం. చిన్నప్పుడు అంతలా ఎలా క్రాకర్స్ కాల్చేదాన్నా అనిపిస్తూ ఉంటుంది!
దీపావళికే వస్తోన్న మీ సినిమా ఎలా ఉండబోతోంది?
‘రాజా ది గ్రేట్’ దీపావళికే రావాల్సిన సినిమా. ఇందులో రవితేజ గారు బ్లైండ్ పర్సన్‌గా కనిపిస్తారు. కళ్లు కనిపించని వారికి ఒక ట్రిబ్యూట్‌లా ఉంటుంది.
దీపావళి అంటే వెలుగుల పండుగ. కానీ కళ్లు లేని వాళ్లకు దీపావళి కూడా చీకటే! అయితే వారి మనసు, మంచి ఆలోచనే గొప్ప వెలుగు అని చెప్పేలా సినిమా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా దీపావళికి రావడమే పర్‌ఫెక్ట్.
తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? పండుగకు ప్రేక్షకులకు ఇచ్చే మెసేజ్?
తెలుగు ఇండస్ట్రీ సూపర్బ్. మహాలక్ష్మి అంటూ ఇప్పటికీ నాపై అదే ప్రేమ చూపిస్తున్నారు. ఐ లవ్ పీపుల్ హియర్. నేనిచ్చే మెసేజ్ అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. ఒకరి లైఫ్‌లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తే మన లైఫ్ కూడా అందంగా ఉంటుంది. అదే దీపావళి.
Comments
Please login to add a commentAdd a comment