
నిఖిల్, సిమ్రాన్, ఉపేందర్
నిఖిల్ దేవాదుల (‘బాహుబలి’ ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘15–18–24 లవ్‌స్టోరీ’. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను కథానాయిక మెహరీన్ చేతుల మీదగా విడుదల చేయించారు.
ఈ సందర్భంగా మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. 15–18–24 వయసులలో ప్రేమ, దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్‌గా నిలుస్తుంది. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో ఈ ఫైట్‌ని చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బీవీ శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్.
Comments
Please login to add a commentAdd a comment