sahiti
-
వీళ్లదండీ విల్ పవర్
ఈ చిరునవ్వుల్ని చూడండి. విహంగమై ఎగరాలన్నంతగా.. వీల్ చెయిర్‌కే ఆశను కల్పించేలా ఉన్నాయి! జీవితంలో స్పీడ్ బ్రేకర్లు ఉండేవే. కొన్నిసార్లు దారే ఉండదు. ‘‘ప్రయాణం మాత్రం సాగాల్సిందే’’ అంటారు సాహితీ, మేఘ. నిస్పృహకు అందనంత ఎత్తులో నిరాశను చేరనీయని ఉత్సాహంతో స్ఫూర్తిగా నిలుస్తున్న అక్కచెల్లెళ్లు వీళ్లు. కాలాన్నే కదలించే చక్రాలు! సాహితీ శ్రీవత్ససకు వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా ఒకరి సాయం అవసరం. అలాంటిది ఒంటరిగా మనాలి మంచు జల్లులను మనసారా ఆస్వాదించి వచ్చారు! వెబ్ కంటెంట్ రైటర్‌గానూ రాణిస్తున్నారు. మేఘ కూడా సొంతంగా కాళ్ల మీద నిలబడే అవకాశం లేకపోయినా ప్రైవేట్ జాబ్ చేస్తూ స్వీయ సంపాదన పొందుతున్నారు. విధి వీల్ చెయిర్‌కే పరిమితం చేసినా లక్ష్య పెట్టని వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సాహితీ, మేఘ అటాక్సియా అనే సమస్యతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా జీవితాన్ని సవాల్‌గా తీసుకోవడం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. సాహితి వయసు 29 ఏళ్లు. మేఘ వయసు 33. పన్నెండేళ్ల క్రితం అటాక్సియా వీరిని నడవటానికి లేకుండా చేసింది. అయినప్పటికీ తమ కలలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తున్నారు. తమలాంటి వారిలో గుండె నిబ్బరం నింపుతున్నారు. ప్రయాణాలే శక్తి సాహితి వీల్ చెయిర్ నుంచే బ్లాగర్‌గానూ, వెబ్ కంటెంట్ రైటర్‌గానూ వర్క్ చేస్తున్నారు. ఆన్లైన్లో రోజూ భగవద్గీత క్లాసులు వింటారు. ‘రాహ్’ అని ఒక ఎంజీవోకు వర్క్ చేస్తున్నారు. ఆ సంస్థ ద్వారా డిసేబుల్డ్ వాళ్లందరికీ మనోధైర్యం, ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. దీపావళి తర్వాత జో«ద్‌పూర్‌లో ‘రాహ్’ క్యాంపెయిన్‌కి వెళ్లబోతున్నారు సాహితి. ‘‘మేం చేస్తున్న పనుల్లో ట్రావెల్ కూడా ముఖ్యమైనదే. నార్మల్‌గా ఉన్నవారే ప్రయాణాలంటే కష్టపడుతుంటారు. అలాంటిది డిజేబుల్డ్ పర్సన్స్ ప్రయాణాలు చేయడం అంటే కుదురుతుందా? అయినప్పటికీ వారు ఒకేదగ్గర ఉండిపోకూడదని ‘టూర్స్’ కూడా ప్లాన్ చేస్తుంటాం’’ అని చెప్పారు సాహితి. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి టూర్స్‌కి వెళ్లారు సాహితి. మనాలి చూడాలని ఆమెకు ఎప్పటి నుంచో ఆశ. అక్కడి మంచును చేత్తో తాకాలని ఆరాటం. తల్లిదండ్రులకు చెబితే ముందు వద్దన్నారు. ఒప్పిస్తే తర్వాత సరేనన్నారు. ‘‘డిజేబుల్డ్ గ్రూప్‌లో మెంబర్‌గా ఉన్నాను కాబట్టి వాలెంటీర్స్ను మాట్లాడుకున్నాను. బయట కూడా వాష్‌రూమ్స్ తప్ప వేరే అవసరం పడదు. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు చెక్ చేసుకున్నాను. టికెట్స్, రూమ్ బుకింగ్.. అన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లో కారు దిగగానే నా కోసం మా గ్రూపు వాలంటీర్ ఒకరు సిద్ధంగా ఉన్నారు. అక్కడ నాకు కావాల్సిన సాయం చేసి వెళ్లిపోయారు. ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడంతో ఇబ్బంది అనిపించలేదు. మూడు రోజులు మనాలీ వెళ్లి వచ్చాను. అక్కడి ‘స్నో’ చూడాలన్న నా ఆశ తీరింది. రోప్‌వే, యార్క్ ఎక్కాను. కరోనా తగ్గాక కామాఖ్య మందిరం (అస్సాం) వెళ్లాలనేది ఇప్పుడున్న ప్లాన్’’ అని తెలిపారు సాహితీ. మొదట సాహితి అక్క మేఘకు ఇంటర్ సెకండియర్ చదువుతున్నప్పుడు ఇలా నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఆమెది బైపీసీ. డాక్టర్ అవాలని ఆ గ్రూపు తీసుకుంది. ఆ తర్వాత ఫార్మసీ వైపు వెళ్లాలని తన ఉద్దేశం. కానీ అటాక్సియా వల్ల కుదర్లేదు. దీంతో ‘‘డిస్టెన్స్‌లో బి.ఎ చేశాను. జాబ్ రిక్రూటర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వర్క్ చేసే చోట లిఫ్ట్ సదుపాయం ఉండేది. నాన్న రోజూ తీసుకెళ్లి సీటులో కూచోబెట్టి వచ్చేవారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. న్యూరో సమస్య అన్నది ఒక డిజార్డర్. కానీ, అది మన మనోబలాన్ని తగ్గించలేదు. ఇలాంటి డిజార్డర్ ఉన్నవారికి మానసికంగా, శారీరకంగా ఫిట్నెస్ ఉండాలి. నాలాంటి వారికి ఫిట్నెస్ సూచనలతోపాటు ఫిజియోథెరపీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పారు మేఘ. నైపుణ్యాలే నడక సాహితి తర్వాత ఇంకో అమ్మాయి కూడా ఉంది. మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఉమ్మడి కుటుంబం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండేవారు. స్కూలు హిమాయత్ నగర్లో. బస్సులో వెళ్లివచ్చేవారు. చివరమ్మాయి ఇప్పుడు అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేస్తోంది. ‘‘అక్క (మేఘ) ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు తరచూ కిందపడిపోయేది. నడవలేకపోతుంటే డాక్టర్‌కి చూపించారు. అటాక్సియా అని చెప్పారు. నాక్కూడా.. బీటెక్‌లో ఉండగా నా నడకలో తేడా ఉందని నాకే అనిపించింది. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో కూడా. ఘట్కేసర్లో కాలేజీ. బీటెక్ చివరి సంవత్సరంలో మాత్రం చాలా కష్టమయ్యింది. హాస్పిటల్‌కి వెళితే ‘పెద్దమ్మాయికి వచ్చిన సమస్యే ఈమెకూ ఉంది’ అన్నారు! అప్పటికే జాబ్స్‌కి ట్రై చేశాను. కానీ, రోజూ ఆఫీసుకు వెళ్లడం కష్టమని ఆగిపోయాను. ఇంటి నుంచే ఫ్రీ లాన్స్ చేయడం మొదలుపెట్టాను. కంటెంట్ రైటర్‌గా అవార్డులూ అందుకున్నాను. మాకున్నది శారీరక లోపం. కానీ, జీవన నైపుణ్యాలు ఉన్నాయి. వాటి మీదే ఫోకస్ చేస్తే వేరే లోపాలేవీ కనిపించకుండా పోతాయి. ముందు మన మైండ్ సెట్‌నిæమార్పు చేసుకోవాలి’’ అని నవ్వుతూ చెప్పింది సాహితీ. న్యూరో సమస్య అన్నది ఒక డిజార్డర్. కానీ, అది మన మనోబలాన్ని తగ్గించలేదు. ఇలాంటి డిసార్డర్ ఉన్నవారికి మానసికంగా, శారీరకంగా ఫిట్నెస్ ఉండాలి. నాలాంటి వారికి ఫిట్నెస్ సూచనలతోపాటు ఫిజియోథెరపీ ఇవ్వాలనుకుంటున్నాను. – మేఘ జీవన నైపుణ్యాల మీదే ఫోకస్ చేస్తే వేరే లోపాలేవీ కనిపించకుండా పోతాయి. ముందు మన మైండ్ సెట్‌నిæ ఛేంజ్ చేసుకోవాలి. – సాహితి పిల్లలే మా ధైర్యం పెద్ద పాపకు ఈ సమస్య వచ్చినప్పుడు ఇక జీవితమే లేదనుకున్నాం. ఏం చేయాలో అర్ధం కాదు. ఇప్పడైతే ఇక మా పిల్లల ధైర్యానికి నేనూ ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఇలాంటి వాళ్లను మా పిల్లల ద్వారానే కొంతమందిని కలిశాను. మొదట్లో గోడలు పట్టుకుని నడిచేవాళ్లు, తర్వాత చెయిర్ పట్టుకుని నడిచేవాళ్లు. ఇప్పుడు అస్సలు నడవలేరు. మమ్మల్ని ఆనందంగా ఉంచాలని పిల్లలు, వాళ్లు ఆనందంగా ఉండాలని మేమూ... రోజూ ప్రయత్నిస్తూనే ఉంటాం. సాహితీ మనాలి వెళ్తాననీ, తన పుట్టిన రోజుకు అక్కడ ఉండాలనీ అన్నప్పుడు మొదట వద్దన్నాను. తర్వాత కాదనలేకపోయాను. సంతోషంగా తిరిగి వచ్చింది. మేఘా, సాహితీ చండీగడ్ కూడా వెళ్లి వచ్చారు. – లలితా రంగాచారి (సాహితి, మేఘల తల్లి) – నిర్మలారెడ్డి ఫొటోలు: దేవేంద్రనాథ్ -
ప్రేమ ప్రభావం
నిఖిల్ దేవాదుల (‘బాహుబలి’ ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘15–18–24 లవ్‌స్టోరీ’. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను కథానాయిక మెహరీన్ చేతుల మీదగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. 15–18–24 వయసులలో ప్రేమ, దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్‌గా నిలుస్తుంది. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో ఈ ఫైట్‌ని చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బీవీ శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్. -
ఓ విద్యార్థి జీవితం
హైస్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందిన చిత్రం ‘బోయ్’. లక్ష్ , సాహితి జంటగా అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘తొలి ప్రయత్నంగా ఓ కమర్షియల్ సినిమానో, ప్రేమకథో చేయవచ్చు. కానీ, ‘బోయ్’ లాంటి సినిమా చేయడం గొప్ప విషయం. నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ‘బోయ్’ కూడా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరో పాత్ర కోసం ఇండియా మొత్తం వెతికాను. మా కెమెరామేన్ ఆష్కర్ ల„Š ని చూపించడంతో వెంటనే ఓకే చేశా. తను ఇండియాలోనే నంబర్ వన్ హీరో అవుతాడు’’ అన్నారు అమర్ విశ్వరాజ్. ‘‘ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్ . ఈ చిత్రానికి సంగీతం: ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె, సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి. -
టీనేజ్ లవ్‌స్టోరీ
‘‘కేర్ ఆఫ్ వాట్సప్’ ట్రైలర్ చూస్తుంటే టీనేజ్ లవ్‌స్టోరీ అని అర్థం అవుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ఉన్నప్పుడే సినిమా బాగా ఆడుతుంది. అవి ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ సముద్ర అన్నారు. ‘బాహుబలి’ చిత్రంలో చిన్నప్పటి ప్రభాస్ పాత్ర చేసిన నిఖిల్ హీరోగా, సాహితి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కేర్ ఆఫ్ వాట్సప్’. నీరజ ప్రధాన పాత్రలో నటించారు. అల్లాడి రవీందర్ రెడ్డి దర్శకత్వంలో లక్ష్మికాంత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ సముద్ర రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను నటుడు నోయల్ విడుదల చేశారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాట్సప్‌తోనే రోజు మొదలవుతుంది.. వాట్సప్‌తోనే రోజు ముగుస్తుంది. ఇలాంటి తరుణంలో మా సినిమా అందరికీ ప్రతి రోజూ గుర్తుకు రావాలనే ఈ టైటిల్ పెట్టాం. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. మంచి కథాం శంతో తెరకెక్కింది. అతి త్వరలోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి. ఈ చిత్రానికి సమర్పణ: రామ్ రెడ్డి, సహ నిర్మాత: కొండా రాఘవేంద్ర రెడ్డి (దేవ కర్ర), సంగీ తం: రాజేష్ తేలు, కెమెరా: భాస్కర్ దోర్నాల. -
సమగ్ర రచనలు వెలుగులోకి తేవాలి
సాహితీ శరత్ కౌముది ఉత్సవాల ముగింపు సభలో రేకపల్లి రాజమహేంద్రవరం కల్చరల్ : శిలావిగ్రహాలు పెట్టడం కాదు, కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మినరసింహం సమగ్ర రచనలు వెలుగులోకి తేవాలని అమలాపురానికి చెందిన న్యాయవాది, సాహితీవేత్త, సంగీత విద్వాంసుడు రేకపల్లి శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి డిగ్రీకళాశాలలో బుధవారం జరిగిన సాహితీ శరత్ కౌముది ముగింపు సభలో రేకపల్లి శ్రీనివాసమూర్తి ‘చిలకమర్తి జీవితం–సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. యుగపురుషుడు వీరేశలింగానికి శిష్యపరమాణువునని చిలకమర్తి స్వీయరచనలో చెప్పుకున్నారన్నారు. అయితే, స్వాతంత్య్ర ఉద్యమ బాటలో కందుకూరి నడిచినట్టు కనపడదు.. కానీ చిలకమర్తి నాడు స్వాతంత్య్రపోరాటానికి సమాంతరంగా నడిచిన అన్ని ఉద్యమాల్లోనూ పాల్గొన్నారన్నారు. దేశభక్తి ప్రపూరితమైన రచనలు ఎన్నిటినో చేశారని తెలిపారు. జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ స్వాతంత్య్ర ఉద్యమకాలంలో రాజమహేంద్రవరంలోని నేటి ఫ్రీడం పార్కులో 5 రోజులు ప్రసంగించారని, వాటిని చిలకమర్తి తెలుగు అనువాదం చేసి, ప్రజలకు అందించేవారన్నారు. ప్రసంగాల చివరిరోజున ’భరతఖండంబు చక్కని పాడియావు’ పద్యాన్ని ఆశువుగా చెప్పారని వివరించారు. కథలు, నాటకాలు, ప్రహసనాలు, జీవితచరిత్రలు..ఇలా ఎన్నో ప్రక్రియల్లో శతాధికంగా చిలకమర్తి రచనలు చేశారన్నారు. తన 40వ ఏట చూపు కోల్పోయినా, మనో నేత్రంతో ప్రపంచాన్ని సందర్శించి రచనలు చేశారన్నారు. మహాత్మునికన్నా ముందే 1907లో నగరంలో రామ్మోహనరావు దళిత పాఠశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. అత్యం త సులభభాషలో చిలకమర్తి రచించిన పద్యాలు అందరికీ అర్ధమవుతాయన్నారు. ’కావు’ (కాపాడు), ’కావు’(కాపాడు) అంటూ కాకి దేవుని ప్రార్థిస్తూ నిద్ర లేస్తుందని, ఈ గుణం మనిషికి పట్టుపడలేదని ఆయన ఒక పద్యంలో చమత్కరించారని రేకపల్లి తెలిపారు. స్త్రీవిద్యను ప్రోత్సహించారని, ’ముదితల్ నేర్వగరాని విద్య గలదె ముద్దార నేర్పించినన్ ’ అని తన పద్యాల్లో తెలిపారన్నారు. సంస్కృతంలో భాసుడు రచించిన 13 నాటకాలను చిలక మర్తి తెలుగులోకి అనువదించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ మాట్లాడుతూ శతాధిక రచనలు చేసిన చిలకమర్తి సొంత ఇంటిని కూడా సమకూర్చుకోలేకపోయారన్నారు. ఫౌండేషన్ తరఫున విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచనపోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కళాశాల కోశాధికారి ఫణి నాగేశ్వరరావు ప్రసంగించారు. ముఖ్య వక్త రేకపల్లి శ్రీనివాసమూర్తిని నిర్వాహకులు సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, సంస్కృత ఉపన్యాసకురాలు కామేశ్వరి పాల్గొన్నారు. -
సాహితీ సిరులు
చిన్నారుల కోసం స్టోరీ టెల్లింగ్... సూట్‌కేసులో తరలివచ్చిన జర్మనీ! ‘ఈరోజు దినపత్రిక రేపటి చిత్తుకాగితం సరే అందులో వచ్చిన వార్త కూడా అలా వదిలేయాల్సిందేనా?’ అంటూ ప్రశ్నించే న్యూస్బ్రీడ్... నగరాన్ని లెన్సుల్లో బంధించి ఒక్క ఫొటోతో చరిత్ర చెప్పిన హైడ్ అండ్ సీక్... ఒకటేమిటి... హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ఆకట్టుకున్న, ఆలోచింపజేసిన విశేషాలెన్నో! వాటి వివరాలు. విజువల్ స్టోరీటెల్లింగ్ ‘పాము తోక తానే తినటం మొదలుపెట్టింది. మధ్యలో ఆగి చూసుకుంటే కాని తిన్నది తన తోకే అని తెలియలేదట. ఇదే పరిస్థితి నేడు అడవులకు పట్టింది’ 9వ తరగతి చదువుతున్న చిన్నారి పాము కథను నేటి వాస్తవ పరిస్థితులతో పోల్చి చెప్పిన వైనం ఇది. ‘అమ్మ చీమను చంపింది, తన ముగ్గురు పిల్లలు చూస్తుండగా..’ ఈచిన్న వాక్యాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రించారు మరికొందరు విద్యార్థులు. ‘దేవుడు ఈగను పుట్టింటాడు, కానీ ఎందుకు పుట్టించాడో చెప్పటం మరిచాడు’ చిత్రాన్ని చూసి చెప్పిన వ్యాఖ్య. చదివిన వాటిని ఊహించి చిత్రించడం, అప్పటికే గీసి ఉన్న చిత్రాలపై వాఖ్యానాలు చెప్పడం వల్ల... పిల్లలలో చదివే ఆసక్తిని పెంచవచ్చంటూ విజువల్ స్టోరీటెల్లింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు గౌరీనోరీ. 50 మందికి పైగా పిల్లలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని కథలకు, పద్యాలకు చిత్ర రూపమిచ్చారు. ఎలా చదువుకోవాలి?, చదివిన దానిని ఎలా అర్థం చేసుకోవాలి? అనే అంశాన్ని బోధించారామె. ఊహించుకోవటం నుంచి క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుందటారు గౌరీ. సూట్‌కేసులో జర్మనీ.. జర్మనీకి వెళ్లాలంటే సూట్‌కేసు సర్దుకోవాలి. అదేం అక్కర్లేకుండా హెచ్ఎల్ఎఫ్కి వచ్చే పిల్లల కోసం జర్మనీనే ఓ సూట్‌కేసులో వచ్చింది. జర్మనీ ప్రాచుర్యంలో గల ప్రాంతాలు, ప్రముఖంగా చేసే వృత్తులు, అక్కడి ఆవిష్కరణలు, అలవాట్లు ఇలా అన్నీ ఒక డబ్బాలో సర్ది ప్రదర్శించారు. మరో బాక్స్‌లో జర్మనీ భాషకు సంబంధించిన వివిధ గేమ్స్ ఆడే అవకాశం కల్పించారు. భాష తెలియకపోయినా ఈ ఆటలో పాల్గొన్ని పిల్లలందరూ జర్మనీ పదాలు, వాటి అర్థాలను చిత్రాల ద్వారా కరెక్టుగా గుర్తించటం ఆశ్చర్యం కలిగించిందన్నారు ఈ బాక్స్ పర్యవేక్షకురాలు రాజేశ్వరి. భావం తెలిస్తే భాష నేర్చుకోవటం కష్టం కాదని ఈ బాక్స్ ద్వారా తెలిసిపోయింది. ది న్యూస్ బ్రీడ్ తెల్లారితే సూర్యుడు వచ్చాడో లేదో చూడటం కన్నా ముంగిట్లో పేపర్ వచ్చిందో లేదో చూసుకోవటం చాలా ముఖ్యం. అలా పేపర్ద్వారానో, టీవీలో వచ్చే డిస్కషన్ ద్వారానో తెలుసుకున్న వార్తల గురించి ఆలోచించటం పక్కన పెట్టి మళ్లీ మన పనుల్లో మనం మునిగిపోతాం. ఎవరికో సంబంధించిన విషయాల్లాగా తెల్లారే సరికి ఆ వార్తలను మన మెమరీలో నుంచి తుడిచేస్తాం. ఇలా వార్తలను కూడా మనం ఆస్వాదించే టీ, బిస్కెట్‌తో సమానంగా మారిపోయాయా? వార్తల పట్ల స్పందించటం అందరి బాధ్యత కాదా? ఈ ఆలోచనను ఎంతో క్రియేటివ్‌గా ప్రదర్శించారు కండ్రూ శివకేశవ్. స్పేస్ అండ్ సెన్సిబిలిటీస్.. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫుట్‌పాత్‌లు, ప్లేగ్రౌండ్స్, పార్క్స్లాంటి పబ్లిక్ ప్రదేశాలు అన్యాక్రాంతమవుతుంటాయి. అలాంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్న స్పృహ పిల్లల్లో కల్పించడానికి నిర్వహించిన వర్క్షాపే స్పేస్ అండ్ సెన్సిబిలిటీస్! పబ్లిక్ స్పేస్‌లు, పాత్‌వేలను అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో ఎంత అద్భుతంగా మలచొచ్చో ఇందులో అవగాహన కల్పిస్తామన్నారు వర్క్‌షాప్ నిర్వాహకురాలు ప్రముఖ ఆర్కిటెక్ట్ గౌరీ మోహిని.