
రాజ్ కందుకూరి, అమర్ విశ్వరాజ్, రవిశేఖర్, లక్ష్
హైస్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందిన చిత్రం ‘బోయ్’. లక్ష్ , సాహితి జంటగా అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘తొలి ప్రయత్నంగా ఓ కమర్షియల్ సినిమానో, ప్రేమకథో చేయవచ్చు. కానీ, ‘బోయ్’ లాంటి సినిమా చేయడం గొప్ప విషయం.
నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ‘బోయ్’ కూడా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరో పాత్ర కోసం ఇండియా మొత్తం వెతికాను. మా కెమెరామేన్ ఆష్కర్ ల„Š ని చూపించడంతో వెంటనే ఓకే చేశా. తను ఇండియాలోనే నంబర్ వన్ హీరో అవుతాడు’’ అన్నారు అమర్ విశ్వరాజ్. ‘‘ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్ . ఈ చిత్రానికి సంగీతం: ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె, సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి.
Comments
Please login to add a commentAdd a comment