
‘‘చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. అదే ఓ మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత’’ అంటున్నారు వెంకటేశ్. పెళ్లి చేసుకున్న వాళ్ల కష్టాల మీద సెటైరికల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ రోజు వెంకటేశ్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ‘ఎఫ్ 2’ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని టీజర్ చెప్పేసింది. ‘సంక్రాంతికి గట్టిగా నవ్వించేట్టున్నారుగా?’ అని ఓ పాత్ర అడగ్గా. ‘అంతేగా.. అంతేగా..’ అంటూ నవ్వులు పంచారు వెంకీ, వరుణ్. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment