
మిల్కీ బ్యూటీ తమన్నా యూరప్ వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. హాలిడే ట్రిప్ ప్లానింగ్ కాదు. ‘ఎఫ్ 2’ మూవీ షెడ్యూల్ షూటింగ్ కోసం వెళ్లారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది.
తాజా షెడ్యూల్ యూరప్‌లోని ప్రాగ్‌లో మొదలు కానుంది. ఈ షూట్‌లో జాయిన్ అవ్వడానికే తమన్నా యూరప్ వెళ్తున్నారు. ఇందులో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు. తోడి అల్లుళ్లగా వెంకీ, వరుణ్ నటిస్తుండగా, అక్కాచెల్లెళ్లుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.