డోస్‌ డబుల్‌ అట! | Venkatesh-Varun F3 Movie starts rolling soon | Sakshi
Sakshi News home page

డోస్‌ డబుల్‌ అట!

Published Tue, Nov 17 2020 3:40 AM | Last Updated on Tue, Nov 17 2020 3:40 AM

Venkatesh-Varun F3 Movie starts rolling soon - Sakshi

‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ (ఎఫ్‌ 2) అంటూ వెంకటేశ్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌లు పంచిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. దర్శకుడు అనిల్‌ రావిపూడి సృష్టించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ‘దిల్‌’ రాజు నిర్మించారు. దీనికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ కథను సిద్ధం చేశారు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ‘ఎఫ్‌2’లో కనిపించిన స్టార్సే ఈ సీక్వెల్‌లోనూ కనిపిస్తారు. ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే డేట్‌ ఫిక్సయిందని సమాచారం. డిసెంబర్‌ 14 నుంచి ‘ఎఫ్‌ 3’ రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందని తెలిసింది. ఈ సీక్వెల్‌లో ఫన్, ఫ్రస్ట్రేషన్‌ రెండింతలు ఉంటుందట. కామెడీ డోస్‌ డబుల్‌ ఉంటుందని టాక్‌. వచ్చే ఏడాది సమ్మర్‌కి థియేటర్స్‌లోకి ‘ఎఫ్‌ 3’ను తీసుకురావాలన్నది చిత్రబృందం ప్లాన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement