వినోదం మూడింతలు | Venkatesh And Varun Tej F3 First Look Poster Released | Sakshi
Sakshi News home page

వినోదం మూడింతలు

Published Mon, Dec 14 2020 12:26 AM | Last Updated on Sun, Mar 28 2021 3:25 PM

Venkatesh And Varun Tej F3 First Look Poster Released - Sakshi

కోబ్రా అంటే పాము అని మనకు తెలుసు. అయితే ‘ఎఫ్‌2’లో కోబ్రా అంటే కో–బ్రదర్స్‌ (తోడల్లుళ్లు). వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ తోడల్లుళ్లుగా ఈ సినిమాలో చేసిన కామెడీ మామూలుగా ఉండదు. వెంకీ సరసన తమన్నా, వరుణ్‌ తేజ్‌కి జోడీగా మెహరీన్‌ నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు వినోదం మూడింతలు అంటూ వెంకీ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ‘ఎఫ్‌ 3’ని ప్రకటించారు. తొలి భాగంలో హీరోలు భార్యల వల్ల ఫ్రస్ట్రేట్‌ అవుతారు.

సీక్వెల్‌లో ఇద్దరూ డబ్బు కారణంగా ఇబ్బందుల పాలవుతుంటారు. ఆ విషయాన్ని సూచిస్తూ, వెంకీ, వరుణ్‌ ట్రాలీలో డబ్బుల కట్టలు పట్టుకుపోతున్న పోస్టర్‌ని విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలోనే రూపొందనున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌లే కథానాయికలు. అదనంగా మరో ముగ్గురు నాయికలు ఉంటారని సమాచారం. ఇద్దరు వెంకీ సరసన, ఇద్దరు వరుణ్‌ తేజ్‌ సరసన నటిస్తారట. మరో హీరో అతిథి పాత్రలో కనిపిస్తారని వినికిడి. బహుశా ఆ హీరోకి జోడీగా ఐదో హీరోయిన్‌ ఉంటుందేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement