లబ్‌ డబ్‌.. డబ్బు | F3 song launch on 7 feb 2022 | Sakshi
Sakshi News home page

లబ్‌ డబ్‌.. డబ్బు

Published Fri, Feb 4 2022 12:13 AM | Last Updated on Fri, Feb 4 2022 12:30 AM

F3 song launch on 7 feb 2022 - Sakshi

వరుణ్‌ తేజ్‌, వెంకటేశ్

‘ఎఫ్‌ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్‌ 3’ టీమ్‌. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 28న ‘ఎఫ్‌ 3’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మొదటి పాట ‘లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ డబ్బు..’ని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతదర్శకుడు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా రాజేంద్ర ప్రసాద్, సునీల్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్‌గా సోనాల్‌ చౌహాన్‌ కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement