ఈ సినిమా కోసం క్లాసులకి వెళ్లా! | Jawaan Movie Grand Release on December 1 | Sakshi

ఈ సినిమా కోసం క్లాసులకి వెళ్లా!

Nov 27 2017 1:17 AM | Updated on Nov 27 2017 1:17 AM

Jawaan Movie Grand Release on December 1  - Sakshi

‘‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ విడుదలైన రెండో రోజే ‘జవాన్‌’కి సంతకం చేశా. అప్పటికి నాకసలు ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తిగా తెలీదు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే... ఇప్పటికీ నాకు ఈ కథ పూర్తిగా తెలీదు. రవిగారు నాపైన పెట్టుకున్న నమ్మకంతోనే ఈ చిత్రం ఒప్పుకున్నా. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. కచ్చితంగా హిట్‌ అవుతుంది’’ అని మెహరీన్‌ అన్నారు. సాయిధరమ్‌ తేజ్, మెహరీన్‌ జంటగా బీవీయస్‌ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్‌’. ‘దిల్‌’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 1న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా మెహరీన్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాలో నా పాత్ర పేర భార్గవి. పెయింటర్‌ని. వెరీ బబ్లీ గాళ్‌. నా గత సినిమాల్లో కంటే ఇందులో కొంచెం ఎక్కువ గ్లామరస్‌గా కనిపిస్తా. సాయిధరమ్‌ తేజ్‌ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఈ సినిమాతో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం. తను మంచి డ్యాన్సర్‌. నాకు పెద్దగా డ్యాన్స్‌ రాదు. అందుకని, ఈ సినిమా కోసం డ్యాన్స్‌ క్లాసులకి వెళ్లా. ప్రాక్టీస్‌ కోసం ఇక్కడ సినిమాలు చేసి, తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోవాలనుకోవడం లేదు. నా దృష్టిలో టాలీవుడ్, బాలీవుడ్‌ వేర్వేరు కాదు. తెలుగు సినిమా నాకు ఎప్పటికీ ఎక్కువే. ఇప్పుడు తెలుగు సినిమానే టాప్‌లో ఉంది. ప్రస్తుతానికి గోపీచంద్‌  25వ సినిమా ఒక్కటే కమిట్‌ అయ్యా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement