లెట్స్‌ డూ ట్యాంగో | Tamanna Bhatia learn Tango dance for Naa Nuvve movie | Sakshi
Sakshi News home page

లెట్స్‌ డూ ట్యాంగో

Published Tue, Jan 23 2018 2:00 AM | Last Updated on Tue, Jan 23 2018 2:00 AM

Tamanna Bhatia learn Tango dance for Naa Nuvve movie  - Sakshi

కత్తి యుద్ధం నేర్చుకోవాలా? గుర్రపు స్వారీ నేర్చుకోవాలా? బస్తీ మే సవాల్‌.. నేర్చేసుకుంటా అంటూ ‘బాహుబలి’ సినిమా కోసం తమన్నా ఆ రెంటిలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మరో చాలెంజ్‌కి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఫైట్‌ కోసం కాదండి. సాంగ్‌ కోసం. తమన్నా ఓ కొత్త డాన్స్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తూ తెగ శ్రమిస్తున్నారట. చిన్న చిన్న గాయాలు కూడా చేసుకున్నారట. తమన్నాను ఇంతలా ఇబ్బంది పెడుతున్న డాన్స్‌ పేరేంటంటే ‘ట్యాంగో’. ఈ ట్యాంగో డాన్స్‌ ఏంటా అనుకుంటున్నారా? పార్టనర్స్‌తో కలిసి చేసే డ్యాన్స్‌ను ట్యాంగో డాన్స్‌ అంటారు.

కొంచెం జిమ్నాస్టిక్స్‌ టచ్‌ డ్యాన్స్‌లో కనిపిస్తుంది. అమెరికన్, యూరోపియన్‌ కంట్రీస్‌లో  ఈ  డాన్స్‌ బాగా ఫేమస్‌. ఏ సినిమా కోసం తమ్మూ నేర్చుకుంటున్నారంటే.. కల్యాణ్‌ రామ్‌ హీరోగా ‘180’ ఫేమ్‌ జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా నువ్వే’.  ఈ సినిమా కోసమే ట్యాంగో డాన్స్‌ నేర్చుకుంటున్నారు తమన్నా. సినిమాలో వచ్చే ఓ ప్రత్యేకమైన సాంగ్‌ కోసం నృత్య దర్శకురాలు బృంద ఆధ్వర్యంలో తమన్నా ప్రాక్టీస్‌ చేస్తున్నారట. ‘‘ట్యాంగో డాన్స్‌ను తొలిసారి ప్రయత్నిస్తున్నాను. అనుకున్నంత సులువుగా ఏం లేదు. ప్రాక్టీస్‌లో చిన్న చిన్న గాయాలు కూడా చేసుకున్నాను. కానీ బృందా మాస్టర్‌ హెల్ప్‌ వల్ల ఈ డ్యాన్స్‌ స్టైల్‌ను నేర్చుకోగలిగాను’’ అని తమన్నా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement