వేసవికి నువ్వే | Nandamuri Kalyan Ram, Tamannaah promise an engaging romantic film | Sakshi
Sakshi News home page

వేసవికి నువ్వే

Published Fri, Jan 12 2018 12:43 AM | Last Updated on Fri, Jan 12 2018 12:43 AM

Nandamuri Kalyan Ram, Tamannaah promise an engaging romantic film - Sakshi

కల్యాణ్‌రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జయేంద్ర దర్శకత్వంలో కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ నిర్మాణంలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘నా.. నువ్వే’ టైటిల్‌ ఖరారు చేశారు. నిర్మాతలు కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి మాట్లాడుతూ –‘‘సరికొత్త కథాంశంతో, ఫ్రెష్‌ లుక్‌తో జయేంద్రగారు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరుకి షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది. ‘నా.. నువ్వే’ టైటిల్‌ కరెక్ట్‌గా సరిపోతుంది.

కల్యాణ్‌ రామ్, తమన్నాల కాంబినేషన్‌ ఈ చిత్రానికే హైలైట్‌. పి.సి. శ్రీరామ్‌గారి కెమెరా వర్క్‌ ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్‌’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్‌ ప్రధానంగా రూపొందుతోన్న చిత్రమిది. పి.సి. శ్రీరామ్, జయేంద్ర వంటి టాప్‌ క్వాలిటీ టెక్నికల్‌ టీమ్‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నాం. వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని సమర్పకుడు మహేష్‌ కోనేరు అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ‘బిత్తిరి’ సత్తి, ప్రియ, సురేఖవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: షరెత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement