జై.. లవ.. కుశ..?
‘త్రిమూర్తులు’, ‘నట విశ్వరూపం’... ఎన్టీఆర్ తాజా చిత్రానికి ఈ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయా? అంటే.. ఫిల్మ్‌నగర్ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపించింది. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా అన్న కల్యాణ్‌రామ్ నిర్మించనున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇది క్లియర్. కానీ, టైటిల్ విషయంలో మాత్రం నో క్లారిటీ. ఎందుకంటే, పైన పేర్కొన్న రెండు టైటిల్స్‌నీ కల్యాణ్‌రామ్ అనుకోలేదట.
ఈ నేపథ్యంలో మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ మూడో టైటిల్ మాత్రం ‘ఫిక్స్’ అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘జై లవకుశ’ అనే టైటిల్‌ను కల్యాణ్‌రామ్ నమోదు చేయించారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారనీ, అందుకే జై, లవ, కుశ అనే పాత్రల పేర్లతో ‘జై లవకుశ’ టైటిల్ పెట్టారన్నది టాక్. చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటిస్తేగానీ టైటిల్ రూమర్లకు చెక్ పడేలా లేదు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.