యాక్షన్ షురూ అయింది. కొన్ని నెలలుగా ఫిట్‌నెస్ మీద వర్కౌట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు కెమెరా ముందు ఆ ఫిట్ బాడీని చూపించడానికి రెడీ అయ్యారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఫస్ట్ షెడ్యూల్‌లో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నారని సమాచారం.
ఈ ఫైట్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ తన సిక్స్‌ప్యాక్ బాడీని చూపిస్తారట. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై యస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ‘‘త్రివిక్రమ్ అద్భుతమైన కథను తయారు చేశారు. ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: పీయస్ వినోద్.
Comments
Please login to add a commentAdd a comment