జోడీ ఎవరు? | Rashmika Mandanna to be seen in NTR and Trivikrams next Movie | Sakshi
Sakshi News home page

జోడీ ఎవరు?

Published Mon, Feb 24 2020 5:37 AM | Last Updated on Mon, Feb 24 2020 5:37 AM

Rashmika Mandanna to be seen in NTR and Trivikrams next Movie - Sakshi

రష్మికా మందన్నా

ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇది. నాగవంశీ, కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు చిత్రబృందం. ‘అరవింద..’లో నటించిన పూజా హెగ్డే మళ్లీ హీరోయిన్‌గా కనిపిస్తారని వినిపించింది. తాజాగా రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారా? అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.. మేలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement