
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద నున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే నెల నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్టు తాజా సమాచారం. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత మరో సినిమా కోసం ఈ ఇద్దరూ కలిశారు. ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై యస్. రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్, పూజా హెగ్డే.. అంటూ పలువురు తారల పేర్లు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించే అవకాశం కూడా ఉందని టాక్. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్‌లోకి తీసుకురానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment