Jai Lavakusha
-
'జైలవకుశ'పై బండ్ల గణేశ్ కామెంట్
హైదరాబాద్ : త్రిపాత్రాభినయంతో అందరినీ మెప్పించి మరోసారి తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయవంతంగా దూసుకెళుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ నటన తీరుతో మైమరిచిపోయారు. మనసులో ఏం అనిపించినా వెంటనే పైకి చెప్పే అలవాటున్న బండ్ల గణేష్ రాత్రి జైలవకుశ చిత్రాన్ని చూసిన వెంటనే ట్విట్టర్ వేదిక ద్వారా తన మనసులో మాట చెప్పారు. 'జై లవకుశ రాత్రి చూశా.. నిద్ర పట్టలేదు! ఎన్టీఆర్.. ఎస్వీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ స్థాయిలో నటించిన మా బాద్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. జై లవ కుశ సినిమా రాత్రి చూసా నిద్ర పట్టలేదు! ఎన్.టి.ఆర్......,ఎన్.వి.ఆర్ ...,తరవాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో @tarak9999 — BANDLA GANESH (@ganeshbandla) 27 September 2017 ఆ స్థాయిలో అద్భుతంగా నటించిన మా బాద్ షాకి హ్రుదయపూర్వక ధన్యవాదాలు.....,@tarak9999 — BANDLA GANESH (@ganeshbandla) 27 September 2017 -
రెండు కోట్ల ప్యాలెస్‌లో...
జై చాలా రిచ్. అద్దాల మేడలో ఉంటాడు. హంస తూలికా తల్పం మీద శయనిస్తాడు. ఆడంబరమైన కారుల్లో తిరుగుతాడు. టోటల్‌గా రాయల్ లైఫ్ అన్నమాట. ఇతగాడు ఉండే ప్యాలెస్ ఖరీదు ఎంతో తెలుసా? రెండు కోట్లు పైనే. ఇన్ని చెప్పారు కదా.. ‘జై’ ఏం చేస్తాడో చెప్పేయరూ అంటున్నారా? అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. జై, లవ, కుశగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. జై పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఒక్క ఈ పాత్ర కోసమే వేసిన రాయల్ ప్యాలెస్ సెట్ ఖరీదు రెండు కోట్లకు పైనే. ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ సెట్ తయారైంది. ఈ నెల 22వరకూ సెట్లో సీన్స్ తీసి, నెలాఖరున ఈ చిత్రబృందం కర్ణాటక వెళుతుంది. అక్కడ పదిరోజులు షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ రిటర్న్ అయ్యాక మళ్లీ సెట్లో చిత్రీకరణ మొదలుపెడతారు. 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఆగస్ట్ సెకండాఫ్ లేదా సెప్టెంబర్ ఫస్టాఫ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
రావణ దర్పం!
రావణుడిలో రౌద్రం, రాజసం రెండూ ఉంటాయి. రెండిటినీ ఒకేసారి చూపిస్తూ, దర్పం ఒలకబోస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి! అటువంటి రావణ దర్పానికి ప్రతీకగా ‘జై లవకుశ’లో ఓ పాత్ర ఉంటుందట! ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ముగ్గురిలో ఇద్దరి పేర్లు లవ, కుశ అయితే... మరొకరి పేరు ‘జై’ అట! ఈ రోజు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ‘జై లవకుశ’లో అతని ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు కదా! మరి, ఈ లుక్ ఎవరిది అంటే... రౌద్ర రావణ రాజస దర్పానికి ప్రతీకగా తీర్చిదిద్దిన ‘జై’ పాత్రదనే మాటలు వినిపిస్తున్నాయి. వీటిపై దర్శక, నిర్మాతలు ఏమంటారో! రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా, నందిత ముఖ్య తారగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది సెకండాఫ్‌లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
జై.. లవ.. కుశ..?
‘త్రిమూర్తులు’, ‘నట విశ్వరూపం’... ఎన్టీఆర్ తాజా చిత్రానికి ఈ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయా? అంటే.. ఫిల్మ్‌నగర్ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపించింది. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా అన్న కల్యాణ్‌రామ్ నిర్మించనున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇది క్లియర్. కానీ, టైటిల్ విషయంలో మాత్రం నో క్లారిటీ. ఎందుకంటే, పైన పేర్కొన్న రెండు టైటిల్స్నీ కల్యాణ్‌రామ్ అనుకోలేదట. ఈ నేపథ్యంలో మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ మూడో టైటిల్ మాత్రం ‘ఫిక్స్’ అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘జై లవకుశ’ అనే టైటిల్‌ను కల్యాణ్‌రామ్ నమోదు చేయించారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారనీ, అందుకే జై, లవ, కుశ అనే పాత్రల పేర్లతో ‘జై లవకుశ’ టైటిల్ పెట్టారన్నది టాక్. చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటిస్తేగానీ టైటిల్ రూమర్లకు చెక్ పడేలా లేదు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.