హైదరాబాద్ : త్రిపాత్రాభినయంతో అందరినీ మెప్పించి మరోసారి తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయవంతంగా దూసుకెళుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫిదా అయ్యారు.
ఎన్టీఆర్ నటన తీరుతో మైమరిచిపోయారు. మనసులో ఏం అనిపించినా వెంటనే పైకి చెప్పే అలవాటున్న బండ్ల గణేష్ రాత్రి జైలవకుశ చిత్రాన్ని చూసిన వెంటనే ట్విట్టర్ వేదిక ద్వారా తన మనసులో మాట చెప్పారు. 'జై లవకుశ రాత్రి చూశా.. నిద్ర పట్టలేదు! ఎన్టీఆర్.. ఎస్వీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ స్థాయిలో నటించిన మా బాద్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు.
జై లవ కుశ సినిమా రాత్రి చూసా నిద్ర పట్టలేదు! ఎన్.టి.ఆర్......,ఎన్.వి.ఆర్ ...,తరవాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో @tarak9999
— BANDLA GANESH (@ganeshbandla) 27 September 2017
ఆ స్థాయిలో అద్భుతంగా నటించిన మా బాద్ షాకి హ్రుదయపూర్వక ధన్యవాదాలు.....,@tarak9999
— BANDLA GANESH (@ganeshbandla) 27 September 2017