
ఫిలింనగర్: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఇచ్చిన పిర్యాదు మేరకు సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలివీ... నౌహిరా షేక్ ఫిలింనగర్‌లోని తన ఇంటిని నిర్మాత బండ్ల గణేష్‌కు నెలకు రూ. లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చింది.
అయితే గత కొంతకాలంగా గణేష్ అద్దె ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అతను ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని, గుండాల సహాయంతో, రాజకీయ నాయకుల అండతో ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. నౌహీరా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment