బాబాయ్ సినిమాపై అబ్బాయిలు ఏమన్నారు? | NTR and kalyanram react to gautamiputra satakarni movie | Sakshi
Sakshi News home page

బాబాయ్ సినిమాపై అబ్బాయిలు ఏమన్నారు?

Published Thu, Jan 12 2017 6:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

బాబాయ్ సినిమాపై అబ్బాయిలు ఏమన్నారు?

బాబాయ్ సినిమాపై అబ్బాయిలు ఏమన్నారు?

బాలకృష్ణ నూరో చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిపై పలువురు అగ్రహీరోలు, దర్శకులు అంతా స్పందించారు. బాలకృష్ణ అన్న కొడుకులు నందమూరి తారక రామారావు, కళ్యాణ్‌రాం కూడా దీనిపై తమ స్పందన ఏంటో తెలిపారు. తారక్ ముందుగానే ఈ సినిమాకు తన శుభాకాంక్షలు తెలిపాడు. 
 
బాబాయ్‌తో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలని, దర్శకుడు క్రిష్‌కు కూడా ఆల్‌ ద బెస్ట్ అని సినిమా విడుదలకు ముందే ట్వీట్ చేశాడు. ఇక హరికృష్ణ మరో కొడుకు నందమూరి కళ్యాణ్‌రామ్ అయితే సినిమా విడుదలైన తర్వాత స్పందించాడు. జీపీపెస్‌కే స్టన్నింగ్‌గా ఉందని అన్నాడు. 2017 ప్రారంభం అదిరిపోయిందని చెప్పాడు. దాంతోపాటు ఖైదీ నెంబర్ 150 హీరో చిరంజీవికి అభినందనలు తెలిపాడు. ఇంకా విడుదల కావాల్సి ఉన్న శతమానం భవతి, కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలకు గుడ్‌లక్ చెప్పాడు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement