అడవి అందాలు | The MLA's shoot is currently in Nirmal neighborhood in Adilabad. | Sakshi
Sakshi News home page

అడవి అందాలు

Published Mon, Oct 16 2017 2:32 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

The MLA's shoot is currently in Nirmal neighborhood in Adilabad. - Sakshi

ఆదిలాబాద్‌ అడవిని చూశారా! చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఆడవికి మరింత అందం వచ్చింది. మరి.. అందాల కాజల్‌ అగర్వాల్‌ ఎంటర్‌ అయితే అంతే కదా. ఎమ్మెల్యే నందమూరి కల్యాణ్‌ రామ్‌ అండ్‌ హిజ్‌ గాళ్‌ఫ్రెండ్‌ కాజల్, సింగ్‌ ఎ సాంగ్‌ అంటూ అక్కడి అడవుల్లో స్టెప్పులేస్తున్నారు. ఈ రోజుల్లో పాటంటే మ్యాగ్జిమమ్‌ అమెరికా లాంటి ఏ ఫారిన్‌ కంట్రీ లొకేషన్‌లోనో... హైదరాబాద్‌లోని స్టూడియోల్లోని సెట్స్‌లోనో తీసేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఫారిన్‌ లొకేషన్స్‌ కంటే బ్యూటిఫుల్‌ ప్లేసులెన్నో ఉన్నాయి.

అందుకే ఆటాపాటా అక్కడ ప్లాన్‌ చేశారు. కల్యాణ్‌రామ్, కాజల్‌ జంటగా ఉపేంద్ర మాధవ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ సి. భరత్‌చౌదరి, ఎమ్‌.వి. కిరణ్‌రెడ్డి నిర్మిస్తున్న ‘ఎమ్మెల్యే’ చిత్రీకరణ ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని నిర్మల్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శేఖర్‌ మాస్టర్‌ నేతృత్వంలో మణిశర్మ స్వరపరచిన పాటను కల్యాణ్‌రామ్, కాజల్‌పై తెరకెక్కిస్తున్నారు. కొత్తేమీ కాదు... ఆదిలాబాద్‌లో పాటలు తీయడం! ‘రుద్రమదేవి’లోని ‘అవునా... నీవేనా?’ పాటను ఆదిలాబాద్‌లో కుంతాల వాటర్‌ ఫాల్స్‌ దగ్గరే తీశారు. ఇప్పుడీ ‘ఎమ్మెల్యే’! ఇంతకీ ‘ఎమ్మెల్యే’ అంటే ఏంటో తెలుసా? మంచి లక్షణాలున్న అబ్బాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement