
జూలై 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కళ్యాణ్‌రామ్ (నటుడు),
జాయెద్ ఖాన్ (నటుడు)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. దీనికి చంద్రుడు అధిపతి కావడం వల్ల ఈ సంవత్సరమంతా కొద్దిపాటి ఒడుదొడుకులుంటాయి కాబట్టి ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా, గతంలో చేపట్టిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలనే కొనసాగించడం మంచిది. ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మానుకుని, ఉన్నదానినే జాగ్రత్తగా చేసుకోవడం శ్రేయస్కరం. స్థిరాస్తులు అమ్ముకుని, చరాస్తుల కొనుగోలు చేసేందుకు ప్రయత్నించవద్దు. తల్లి లేదా భార్య తరఫు వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. చంద్రుడి ప్రభావం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. సౌందర్యంపై దృష్టి పెడతారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త కొత్త ఐడియాలు ప్రదర్శించి లాభపడతారు. మీలోని సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కవులు, కళాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్కీనంబర్స్: 1,2,5, 6,9; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, శాండల్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు.
సూచనలు: వెండితో ముత్యపుటుంగరాన్ని ధరించడం, పాలు, బియ్యంతో చేసిన పాయసాన్ని అనాథలకు పెట్టడం, రోజూ కొద్దిసేపు వెన్నెలలో విహరించడం, తల్లిని, తల్లితో సమానులైన వారిని ఆదరించి, గౌరవించడం .
- రెహమాన్ దావూద్,
జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు