అదే బ‍్యానర్‌లో మరో సినిమా | Kalyanram Next With Naa Nuvve Makers | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 23 2018 1:37 PM | Last Updated on Mon, Apr 23 2018 1:37 PM

Kalyanram Next With Naa Nuvve Makers - Sakshi

త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కల్యాణ్‌ రామ్‌.. తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు. ఏప్రిల్‌ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను కూడా నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్‌ కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే నిర్మించనున్నారు.

జల్సా, దూకుడు, ఆగడు లాంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ సరసన నివేదా థామస్‌, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నా నువ్వే మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement