రొమాంటిక్‌ రామ్‌ | Kalyanram new film romantic ram | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ రామ్‌

Published Tue, May 23 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

రొమాంటిక్‌ రామ్‌

రొమాంటిక్‌ రామ్‌

మాస్‌... మమ మాస్‌! ఇప్పటివరకు నందమూరి కల్యాణ్‌రామ్‌ ఎక్కువగా మాస్‌ సినిమాలే చేశారు. వాటిలో రొమాన్స్‌ ఉన్నా... మాస్‌ సీన్స్‌ ముందు ఆ రొమాంటిక్‌ సీన్స్‌ ప్రేక్షకులకు పెద్దగా కనిపించలేదు. అందుకేనేమో, కాస్త రూటు మార్చి తన నటనలో రొమాంటిక్‌ యాంగిల్‌ను చూపించాలని నిర్ణయించుకున్నట్టున్నారు.

ప్రస్తుతం నూతన దర్శకుడు ఉపేంద్రతో ఓ సినిమా చేస్తున్న ఈ మాస్‌ రామ్, తదుపరి సినిమాను ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌మేకర్, ‘180’ మూవీ ఫేమ్‌ జయేంద్ర దర్శకత్వంలో చేయనున్నారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాకు పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. రొమాంటిక్‌ రామ్‌కు జోడీగా నటించే భామను త్వరలో పరిచయం చేస్తామని జయేంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement