‘‘బింబిసార’ రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్ఠ్‌కు ధన్యవాదాలు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కొంతమంది మాటలు వింటే భయమేసేది.
అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాను.. ‘బింబిసార’ విషయంలో అదే నిజమైంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘మేజర్, విక్రమ్’ సినిమాలు మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘బింబిసార, సీతారామం’ ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను’’ అన్నారు. ‘‘మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వశిష్ఠ్. డిస్ట్రిబ్యూటర్లు శివరాం, ఎల్.వి.ఆర్, హరి, ఎ.ఎం.ఆర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment