Bimbisara Movie Now Streaming On ZEE5 OTT Platform From Today - Sakshi
Sakshi News home page

Bimbisara OTT Release: ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌

Oct 21 2022 9:17 AM | Updated on Oct 21 2022 10:10 AM

Bimbisara Movie Now Streaming On Zee5 From October 21st Mid Night - Sakshi

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత కల్యాణ్‌ రామ్‌ నటించిన లేటెస్ట్‌  మూవీ బింబిసార. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టేశాడు కల్యాణ్‌ రామ్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం గత ఆగస్ట్‌ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. కలెక్షన్స్‌ పరంగా కూడా పైసా వసూళ్‌ అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో అక్టోబర్‌21 (శుక్రవారం) అర్ధరాత్రి నుంచే బింబిసార స్ట్రీమింగ్‌ అవుతోంది.

కాగా బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంట‌సీ డ్రామాగా డైరెక్టర్‌ వశిష్ఠ్‌  ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కేథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా.. శ్రీనివాస్ రెడ్డి, ప్ర‌కాశ్ రాజ్‌, వెన్నెల కిశోర్‌ కీల‌క పాత్ర‌లో కనిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement