Bimbisara Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Bimbisara OTT Release : ఓటీటీలోకి 'బింబిసార'.. స్ట్రీమింగ్‌ అయ్యేది అక్కడే

Published Sun, Oct 16 2022 11:45 AM | Last Updated on Sun, Oct 16 2022 1:18 PM

Nandamuri Kalyan Ram Bimbisara OTT Release Date Locked - Sakshi

నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌ 5న రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది. బింబిసార ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్‌  ప్లాట్‌ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబరు 21 నుంచి తెలుగు, కన్నడతో పాటు తమిళం, మలయాళంలో ఒకేసారి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. 

కాగా ఈ చిత్రంలో  కల్యాణ్‌ రామ్‌  బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement