Bimbisara Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Bimbisara Movie OTT Release: ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!

Published Tue, Sep 27 2022 3:02 PM | Last Updated on Tue, Sep 27 2022 3:41 PM

Bimbisara Movie OTT Release: Bimbisara OTT Release Date, Streaming Partner - Sakshi

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ అనంతరం నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ నటించిన చిత్రం బింబిసార.రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్ ని ఖాతాలో వేసుకుంది.

చదవండి: Srihari Wife Shanthi: ‘డబ్బులు ఇవ్వకుండా వారు మోసం చేశారు’

ఇందులో కల్యాణ్‌ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్‌ రోల్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇక థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమైంది.  ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్‌  ప్లాట్‌ఫాం జీ5 సంస్థ ఫ్యాన్సీ ధర సొంతం చేసుకుంది. దీంతో దసరాకు బింబిసార మూవీని జీ5లో అందుబాటులోకి తెచ్చేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

చదవండి: మహిళా యాంకర్‌ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్‌

దసరా కానుకగా ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు అక్టోబర్‌ 7వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై జీ5 నిర్వహకులు అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్‌, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement