నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా కల్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది.
చదవండి: Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. 50 రోజుల తర్వాతే బింబిసార ఓటీటీలో విడుదల అవుతుందని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 23న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. .నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment