'బింబిసార 2' నుంచి ఎందుకు తప్పుకున్నానంటే: వశిష్ట | Director Vasishta Reacts On Bimbisara Part 2 Clashes With Kalyanram, Deets Inside - Sakshi
Sakshi News home page

Director Vasishta: 'బింబిసార 2' నుంచి ఎందుకు తప్పుకున్నానంటే

Published Thu, Jan 18 2024 9:28 PM | Last Updated on Fri, Jan 19 2024 9:35 AM

Director Vasishta Comments On Bimbisara Part 2 Clashes With Kalyanram - Sakshi

వరుస పరాజయాలతో సతమతమవుతున్న కల్యాణ్‌ రామ్​కు.. కెరీర్​లో బిగ్గెస్ట్​ హిట్ చిత్రంగా నిలిచింది 'బింబిసార'. టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీగా ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కించాడు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద హిట్ కావడంతో మూవీకి సీక్వెల్ ప్లాన్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పార్ట్‌-2 డైరెక్టర్‌గా వశిష్ట తప్పుకున్నాడు. దీంతో గతంలో పలు రకాలుగా వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం మెగాస్టార్‌తో విశ్వంభర చిత్రాన్ని ఆయన డైరెక్ట్‌ చేస్తున్నాడు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ఠ ఇదే  విషయంపై ఎట్టకేలకు ఇలా క్లారిటీ ఇచ్చారు.  'రామ్​ చరణ్‌తో నేను 'బాహుబలి' లాంటి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. గతంలో కూడా నేను ఎక్కడా మాట్లాడలేదు.. కానీ ప్రచారం మాత్రం జరిగింది. నేను మెగాస్టార్‌ చిరంజీవితో  'జగదేకవీరుడు అతిలోక సుందరి' లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుందని చెబితే.. రామ్‌ చరణ్‌తో వశిష్టి సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. నాకు ఫాంటసీ స్టోరీస్​ అంటే చాలా ఇష్టం. 'బింబిసార' సీక్వెల్​ను నేను డైరెక్ట్​ చేయడం లేదు. పార్ట్‌-2 కథ విషయంలో నా ఆలోచన వేరుగా ఉంది. దాని గురించి చర్చిస్తున్న సమయంలో నాకు 'విశ్వంభర' ఆఫర్ వచ్చింది.

ఇదే విషయాన్ని కల్యాణ్‌ రామ్‌తో చెప్పి ఆపై ఆయన అనుమతి ​ తీసుకున్న తర్వాతే 'బింబిసార 2' నుంచి బయటకు వచ్చాను. ఆపై మెగాస్టార్‌తో సినిమా ఓకే చేసుకున్నాను.' అని వశిష్ఠ తెలిపారు. చిరంజీవితో  'విశ్వంభర' చిత్రాన్ని భారీ బడ్జెత్‌ వశిష్ట డైరెక్ట్‌ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా కాన్సెప్ట్‌ వీడియోను ఆయన విడుదల చేశారు. దానికి భారీగా రెస్పాన్స్‌ వస్తుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement