Mallidi Vasishta
-
'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్ వేగంగా ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. కొద్దిరోజుల క్రితమే ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత వారిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'విశ్వంభర'లో ఇషా చావ్లా, సురభి అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిద్దరిపై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయిన సైలెంట్‌గా వీరిద్దరితో షూటింగ్ కూడా ప్రారంభించారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందులో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభి కూడా పాల్గొంటారని టాక్. ప్రేమ కావాలి,రంభా ఊర్వసి మేనక వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో వీరిద్దరి పాత్ర ఎంత పరిధి వరకు ఉంటుందో తెలియాల్సి ఉంది. ‘విశ్వంభర’ని సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌గా దీనిని వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. -
'విశ్వంభర'లో అడుగు పెట్టిన టాప్ హీరోయిన్.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. తాజాగా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి విశ్వంభర చిత్రంలో త్రిష నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ నుంచి ఇలా అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. గతంలో వీరిద్దరూ స్టాలిన్ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ వస్తుంది. ఇందులో అనుష్క, హనీ రోజ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా త్రిష కూడా తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. '18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదీ నాకు ఎంతో గొప్ప గౌరవం. చిరు సార్ నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు.' అని తెలిపింది. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి అందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానుంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) What an honour it is to reunite with the one and only MEGASTAR after 18 years.Thank you so much for the warmest welcome Chiru sir❤️@KChiruTweets https://t.co/PSrJ4O7LEW — Trish (@trishtrashers) February 5, 2024 -
విశ్వంభర డేట్ ఫిక్స్
సంక్రాంతి రిలీజ్ డేట్‌ను కన్ఫార్మ్ చేసుకున్నాడు ‘విశ్వంభర’. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. గత ఏడాది నవంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తొలుత చిరంజీవి పాత్రకు సంబంధించని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘విశ్వంభర’ సినిమా సెట్స్‌లో ఈ శుక్రవారం చిరంజీవి జాయిన్ అయినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొని, ఈ సినిమాను జనవరి 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హైదరబాద్‌లో వేసిన ఓ సెట్లో ప్రొడక్షన్ వర్క్ జరుగు తోందని కూడా చిత్రబృందం పేర్కొంది. -
చిరంజీవి 'విశ్వంభర' విడుదల తేదీ ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసారా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించింది. 2025 జనవరి 10న విశ్వంభర వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఖర్చుతో ఓ సెట్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సెట్ ఉంటుందని, అందుకోసం నిర్మాతలు కూడా భారీగా వెచ్చిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఫిబ్రవరి 3 నుంచి మెగాస్టార్ షూటింగ్లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తుండగా కెమెరామెన్ఘా ఛోటా కె.నాయుడు ఉన్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వవ్యాప్తంగా 'విశ్వంభర' విడుదల కానుంది. A LEGEND RISES 🔮🔥 MEGASTAR @KChiruTweets sets his foot into the mighty world of #Vishwambhara ❤🔥 Shoot in Progress. In cinemas 10th Jan 2025 🌠@DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @UV_Creations pic.twitter.com/Qrzvlsuv5b — UV Creations (@UV_Creations) February 2, 2024 -
'బింబిసార 2' నుంచి ఎందుకు తప్పుకున్నానంటే: వశిష్ట
వరుస పరాజయాలతో సతమతమవుతున్న కల్యాణ్ రామ్‌కు.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది 'బింబిసార'. టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీగా ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కించాడు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద హిట్ కావడంతో మూవీకి సీక్వెల్ ప్లాన్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పార్ట్-2 డైరెక్టర్‌గా వశిష్ట తప్పుకున్నాడు. దీంతో గతంలో పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మెగాస్టార్‌తో విశ్వంభర చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ఠ ఇదే విషయంపై ఎట్టకేలకు ఇలా క్లారిటీ ఇచ్చారు. 'రామ్ చరణ్‌తో నేను 'బాహుబలి' లాంటి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. గతంలో కూడా నేను ఎక్కడా మాట్లాడలేదు.. కానీ ప్రచారం మాత్రం జరిగింది. నేను మెగాస్టార్ చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుందని చెబితే.. రామ్ చరణ్‌తో వశిష్టి సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. నాకు ఫాంటసీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. 'బింబిసార' సీక్వెల్‌ను నేను డైరెక్ట్ చేయడం లేదు. పార్ట్-2 కథ విషయంలో నా ఆలోచన వేరుగా ఉంది. దాని గురించి చర్చిస్తున్న సమయంలో నాకు 'విశ్వంభర' ఆఫర్ వచ్చింది. ఇదే విషయాన్ని కల్యాణ్ రామ్‌తో చెప్పి ఆపై ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే 'బింబిసార 2' నుంచి బయటకు వచ్చాను. ఆపై మెగాస్టార్‌తో సినిమా ఓకే చేసుకున్నాను.' అని వశిష్ఠ తెలిపారు. చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాన్ని భారీ బడ్జెత్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా కాన్సెప్ట్ వీడియోను ఆయన విడుదల చేశారు. దానికి భారీగా రెస్పాన్స్ వస్తుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్‌కే ఛాన్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మెగా 156గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే పేరు ఖారారు చేయనున్నారు. ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా... యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమే పోరాట ఘట్టాలతో మొదలైంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకని చిరంజీవి ఇటీవల విరామం తీసుకుని హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా ప్రత్యేకమైన ఓ ఊహా ప్రపంచం నేపథ్యంలో సాగనుంది. చిరంజీవి సరసన పలువురు కథానాయికలు నటించే అవకాశాలున్నాయి. నిజానికి ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒక్కరే హీరోయిన్ అని గతంలోనే బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు తెరపైకి త్రిష పేరు బయటకు వచ్చింది. అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ ఛాన్స్ త్రిషకు దక్కినట్లు తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్,లియో వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో త్రిషకు కూడా గుర్తింపు ఉంది. కానీ చాలా రోజుల నుంచి ఆమె టాలీవుడ్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తుంది. మెగాస్టార్ చిత్రంతో వస్తున్న ఈ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకోవాలని చూస్తుందట. అప్పట్లో, త్రిష, చిరంజీవి కాంబినేషన్లో స్టాలిన్ చిత్రం ద్వారా మెప్పించారు. తర్వాత ఆచార్య సినిమాతో మరోసారి ఆచార్య సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నారు. ఏది ఏమైనా చిరు సినిమాలోకి త్రిష ఎంట్రీకి సంబంధించి అఫీషియల్ అప్ డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మెగా 156లో విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు. -
వశిష్ఠతో చిరంజీవి జర్నీ ప్రారంభం ఎప్పుడంటే..?
మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబినేషన్లో వస్తున్న మెగా 156 సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ భారీ బడ్జెట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయిందట. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్‌తో చిరంజీవి కోసం కథ రెడీ చేశాడు. UV క్రియేషన్స్ ద్వార విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 25 నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రానుంది. షూటింగ్ ప్రారంభమే భారీ యాక్షన్ సీన్స్‌తో మొదలు కానుందట.. ఈ కథలో ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఊహకందని యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట ఈ సినిమా గురించి ఇలా తెలిపారు. 'చిరంజీవిగారు పూర్తి స్థాయి ఫాంటసీ కథలో నటించి చాలా రోజులైంది. అందుకే ఆయన కోసం పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి అద్భుతమైన కథను సిద్ధం చేశా.' అని హింట్ ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారులను మెచ్చే అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్గా నటించే ఛాన్స్ ఆమెకు అంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చినా ప్రముఖంగా అనుష్క పేరు వినిపిస్తోంది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ విజువల్ వండర్‌ను కెమెరామెన్ ఛోటా కె. నాయుడు చిత్రీకరించనున్నారు. -
చిరంజీవి- వశిష్ట సినిమాకు టైటిల్ అదిరిపోయింది
మెగాస్టార్ చిరంజీవి - బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. ఫాంటసీ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం 'మెగా 156' అనే టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటుల ఎంపిక పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా ఫ్యాన్స్ ఈ మూవీ టైటిల్ అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'విశ్వంభర' అనే సరికొత్త టైటిల్‌ను మూవీ టీమ్ దాదాపు ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ మొత్తం మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని సమాచారం. దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విలన్‌గా దగ్గుబాటి రానాను ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్గా అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను కూడా ఎమ్ ఎమ్ కీరవాణి రికార్డింగ్ చేసినట్లు తాజాగా ఆయన చెప్పారు. 2025 సంక్రాంతి బరిలో సినిమాను దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ముల్లోకాల వీరుడికి జగదేక వీరుడి దెబ్బ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ సినిమాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అని చెప్పవచ్చు. చిరంజీవి- వశిష్ట మూవీ కూడా సోషియో ఫాంటసీనే అనే ప్రకటన వచ్చిన నేపథ్యంలో వైజయంతీ మూవీస్ సంస్థ పరోక్షంగా ఓ ట్వీట్ చేసింది. తమ కథ, సినిమా, టైటిల్ ఇలా దేన్నైనా సరే వారి అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన ఇచ్చింది. దీంతో 'ముల్లోకాల వీరుడు' అని పెట్టాలనుకున్న టైటిల్‌ను విరమించుకుని 'విశ్వంభర' అనే సరికొత్త టైటిల్‌ను 'మెగా 156'కు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. -
Mega 156 Pooja Ceremony Photos: చిరంజీవి-వశిష్ఠ 'మెగా 156' సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు
-
మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
మెగా 157 ప్రాజెక్ట్ కాస్త నంబర్ మారి మెగా 156 అయిన విషయం తెలిసిందే. 'బింబిసార'తో అటు చిత్ర పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ. తన రెండో సినిమాలోనే మెగాస్టార్ లాంటి లెజెండ్ హీరోను డైరెక్టె చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇటీవల నిర్వహించిన ‘సైమా’ (SIIMA) వేడుకల్లో ఉత్తమ పరిచయ దర్శకుడిగా 'బింబిసార' సినిమాతో వశిష్ఠ అవార్డు అందుకున్నారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రధాన టీమ్‌ను ఒక వీడియో ద్వారా యూవీ క్రియేషన్స్ మేకర్స్ ప్రకటించారు. అందులో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణితో వీడియో ప్రారంభం అవుతుంది. ఆపై మెగాస్టార్ తన సతీమణి సురేఖతో కలిసి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చోటా కె. నాయుడు ఉన్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గేయ రచయితగా ఉన్నారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. కాస్ట్యూమ్స్ సుష్మిత కొణిదెల,ఏడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు వంటి వారు మెగా 156 ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. త్వరలో ఈ చిత్రానికి టైటిల్ కూడా ప్రకటించనున్నారు. -
వశిష్ట సినిమా విషయంలో షాకింగ్ న్యూస్ చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ భారీ డిజాస్టర్ తర్వాత రెండు చిత్రాలను ప్రకటించారు. ఇందులో మెగా 156 చిత్రాన్ని తన కుమార్తె సుష్మిత నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేశారు. మరోకటి మెగా 157 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌లో బింబిసార డైరెక్టర్ వశిష్టతో స్కెచ్ వేశారు. కానీ ఇక్కడ చిరు చిన్న మార్పు చేశారు. మెగా 157వ చిత్రంపైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. డైరెక్టర్ వశిష్ట కథ పట్ల ఆయనకు భారీ నమ్మకం ఏర్పడ్డాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగా 156 చిత్రాన్ని వదిలేసి మెగా 157 ప్రాజెక్ట్‌పైనే ఆయన ఫోకస్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్న సినిమానే ముందుగా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అందులో భాగంగానే తాజాగా ఆ ప్రాజెక్ట్‌ను మెగా 156 అని ఒక పోస్టర్‌ను వశిష్ఠ షేర్ చేశారు. మెగాస్టార్-వశిష్ఠ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సంగీత దర్శకుడిగా ఎమ్ఎమ్ కీరవాణి భాగమయ్యారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తుండగా చోటా కె. నాయుడు కెమెరామెన్‌గా ఉన్నారు. ఇక మెగా 156 గురించి మాట్లాడుకుంటే.. ఈ సినిమాకు సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని, త్వరలో ఆ డైరెక్టర్ని చిరునే అధికారికంగా ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే దసరా రోజున అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పాడు చిరు. తన లైన్లో మెగా 156 లేదు అంటూ తెలిపాడు. మెగా 157 గా తెరకెక్కుతున్న వశిష్ట సినిమానే మెగా 156 గా మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా 156 పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. #Mega156 begins 🔥 దసరా శుభాకాంక్షలు 🏹 Mega Star @KChiruTweets @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/sMsVhXnbAj — Vassishta (@DirVassishta) October 23, 2023 -
కొత్త సినిమాకు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌ను ఓకే చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన 'భోళా శంకర్' సినిమా సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్‌కి కూడా నచ్చలేదని చెప్పవచ్చు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్‌పైనా విమర్శలు వచ్చాయి. మెగస్టార్ లాంటి పెద్ద నటుడితో సినిమా తీస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని ఆయనపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా చిరంజీవి కూడా రీమేక్స్ సినిమాలను మరోసారి తీయకండని ఫ్యాన్స్ కూడా కోరారు. (ఇదీ చదవండి: సీఎం యోగి పాదాలను తాకడంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్) దీంతో ఆయన నుంచి వచ్చే కొత్త ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇందులో భాగంగా యూవీ క్రియేషన్స్ నుంచి చిరంజీవి తర్వాతి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన కథను 'బింబిసార' మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ కథను రెడీ చేశారు. మెగా 157 సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటంచారు. సోషియో ఫాంటసీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో పంచభూతాల గుర్తులను వశిష్ట చూపించాడు. టైటిల్ ఇదేనా..? డైరెక్టర్ వశిష్ఠ, మెగాస్టార్ కాంబో నుంచి వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో అనగా అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల మాదిరిగా ఉండబోతోందని సమాచారం. ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యలా భూమి మీదకు వచ్చి మానవుడైనా చిరంజీవిని ప్రేమించగా. అప్పుడు ఎదురైన ఇబ్బందులను చిరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడో చూశాం. (ఇదీ చదవండి: చిరంజీవిని మెప్పించిన డైరెక్టర్ వశిష్ఠ గురించి పూర్తి వివరాలు) ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్‌తో కొందరు దేవకన్యలు భూమిపైకి రావడం వంటి ముఖ్యమైన కాన్సెప్ట్‌తో మెగా 157 ఉండనున్నట్లు సమాచారం. పంచభూతాలను చిరు ఎలా అధిగమిస్తాడనే కథాంశం మీద స్టోరీ లైన్ ఉండవచ్చు. ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్నది అయితే తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. #Mega157 🔮 This time, its MEGA MASS BEYOND UNIVERSE ♾️ The five elements will unite for the ELEMENTAL FORCE called MEGASTAR ❤️🔥 Happy Birthday to MEGASTAR @KChiruTweets Garu ❤️@DirVassishta @UV_Creations#HBDMegastarChiranjeevi pic.twitter.com/llJcU6naqX — UV Creations (@UV_Creations) August 22, 2023