ప్రముఖ దర్శకుడు వశిష్ట టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించాడు. తన టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, దాని నుంచి ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా పట్టించుకోవద్దని కోరాడు.
వశిష్ట విషయానికి వస్తే.. చేసింది ఒక్క సినిమానే అయినా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బింబిసార మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. గతంలో ఇతడు ప్రేమలేఖ రాశా అనే మూవీలోనూ చిన్న పాత్రలో నటించాడు.
విశ్వంభర విషయానికి వస్తే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని విక్రమ్, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు.త్రిష, కునాల్ కపూర్, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Hi everyone, I just found out that my Telegram account has been hacked. If you receive any messages from it, please ignore them. Thank you!
— Vassishta (@DirVassishta) November 15, 2024
Comments
Please login to add a commentAdd a comment