చిరంజీవి- వశిష్ట సినిమాకు టైటిల్‌ అదిరిపోయింది | Megastar Chiranjeevi And Vasishta Mega 156 Movie Rumoured Title Trending On Social Media - Sakshi
Sakshi News home page

Mega 156: చిరంజీవి- వశిష్ట సినిమాకు టైటిల్‌ అదిరిపోయింది

Published Thu, Oct 26 2023 6:59 AM | Last Updated on Thu, Oct 26 2023 9:50 AM

Chiranjeevi And Vasishta Mega 156 Title - Sakshi

మెగాస్టార్​ చిరంజీవి ​- బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. ఫాంటసీ జానర్​లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం 'మెగా 156' అనే టైటిల్​తో చిత్రీకరణ జరుపుకుంటోంది.  ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో భారీగా ట్రెండ్‌ అవుతున్నాయి. నటీనటుల ఎంపిక పనిలో మేకర్స్‌  ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్​ మొదలైన సందర్భంగా ఫ్యాన్స్​ ఈ మూవీ టైటిల్​ అప్​డేట్​ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'విశ్వంభర' అనే సరికొత్త  టైటిల్‌ను మూవీ టీమ్‌​ దాదాపు ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ మొత్తం మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని సమాచారం. దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విలన్‌గా దగ్గుబాటి రానాను ఇ‍ప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను కూడా ఎమ్‌ ఎమ్‌ కీరవాణి రికార్డింగ్​ చేసినట్లు తాజాగా ఆయన చెప్పారు.  2025 సంక్రాంతి బరిలో సినిమాను దింపాలని మేకర్స్ సన్నాహాలు ​ చేస్తున్నారట.  

ముల్లోకాల వీరుడికి జగదేక వీరుడి దెబ్బ
చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ సినిమాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అని చెప్పవచ్చు. చిరంజీవి- వశిష్ట మూవీ కూడా సోషియో ఫాంటసీనే అనే ప్రకటన వచ్చిన నేపథ్యంలో వైజయంతీ మూవీస్ సంస్థ పరోక్షంగా ఓ ట్వీట్​ చేసింది. తమ కథ, సినిమా, టైటిల్ ఇలా దేన్నైనా సరే వారి అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన ఇచ్చింది. దీంతో 'ముల్లోకాల వీరుడు' అని పెట్టాలనుకున్న టైటిల్‌ను విరమించుకుని 'విశ్వంభర' అనే సరికొత్త  టైటిల్‌ను 'మెగా 156'కు ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement